For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్విటేషన్ వస్తే లక్కీ! యాపిల్ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకోండి

|

న్యూయార్క్: టెక్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి అడుగు పెట్టింది. యాపిల్ బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్‌ను మంగళవారం నాడు రిలీజ్ చేసింది. ప్రాథమికంగా మొబైల్ ద్వారా వినియోగించేలా యాపిల్ ఈ క్రెడిట్ కార్డును డిజైన్ చేయడం గమనార్హం. గోల్డ్‌మన్ శాచ్ భాగస్వామ్యంతో దీనిని తీసుకువస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలోనే యాపిల్ ప్రకటించింది యాపిల్ కార్డు కోసం నోటిఫికేషన్ అందుకున్న కొంతమంది ఐఫోన్ యూజర్లు, యాపిల్ వాలెట్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రానున్న కాలంలో దీనిని మరింతగా విస్తరించనుంది.

<strong>గుడ్‌న్యూస్: సులభ ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఈ-ఫైలింగ్ లైట్</strong>గుడ్‌న్యూస్: సులభ ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఈ-ఫైలింగ్ లైట్

వర్చువల్ కార్డు.. ఇన్విటేషన్ వస్తే లక్కీ

వర్చువల్ కార్డు.. ఇన్విటేషన్ వస్తే లక్కీ

యాపిల్ వర్చువల్ క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఐఫోన్‌కు యాడ్ఆన్ రూపంలో లభించనుంది. యాపిల్ ఫోన్ల విక్రయాల నుంచి భిన్నంగా బ్యాంకింగ్ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన యూజర్లు దీనిని వినియోగించే అవకాశం ఉంది. ఎంతమంది యూజర్లకు అవకాశం కల్పించారో తెలియరాలేదు. మంగళవారం నుంచి వీరికి ఇన్విటేషన్లు వెళ్ళాయి. ఇన్విటేషన్ వచ్చినవారు లక్కీగా భావిస్తారు.

ఈ ఐవోఎస్ అవసరం

ఈ ఐవోఎస్ అవసరం

యాపిల్ వర్చువల్ క్రెడిట్ కార్డు వినియోగించాలంటే 12.4 IOS ఉండాలి. ప్రస్తుతం క్రెడిట్ కార్డ్సు ఉపయోగిస్తున్న దానికి భిన్నంగా యాపిల్ దీనిని తీసుకు రావడం గమనార్హం. ఐఫోన్‌లో వాలెట్ యాప్ ద్వారా యాపిల్ కార్డుకు సైనిన్ అవాలి. అప్పుడు కార్డు యాపిల్ పేకు అనుసంధానం అవుతుంది. ఆ వెంటనే కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్, ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసుకోవచ్చు.

రివార్డు పాయింట్స్

రివార్డు పాయింట్స్

ఫిజికల్ కార్డుపై యాపిల్ లోగో మాత్రం ఉంటుంది. మీ పేరు, నెంబర్, కార్డు ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ నెంబర్ ఆ తర్వాత మెయిల్‌కు వస్తాయి. యాపిల్ కార్డు యూజర్లు కూడా కొనుగోళ్లు (ట్రాన్సుఫర్ చేస్తే)పై క్యాష్ బ్యాక్ రివార్స్ పొందుతారు. క్యాష్ బ్యాక్‌లు ఫిజికల్ కార్డు అయితే 1 శాతం, కాంటాక్ట్ లెస్ అయితే 2 శాతం, యాపిల్ ద్వారా కొనుగోలు చేస్తే 3 శాతం ఉంటాయి.

ఇలా చేయాలి...

ఇలా చేయాలి...

యాపిల్ కార్డు కోసం... మీ అడ్రస్, ఆదాయపు వివరాలు, పుట్టిన రోజు, అమెరికాకు సంబంధించిన సోషల్ సెక్యూరిటీ నెంబర్ చివరి నాలుగు అంకెలను యాప్‌లో నమోదు చేయాలి. ఇవి గోల్డ్‌మన్ శాక్స్‌కు వెళ్తాయి. ఆ సంస్థ కార్డు దరఖాస్తును స్వీకరించడం లేదా తిరస్కరించడం చేస్తుంది. ఒక్క నిమిషంలోనే తెలిసిపోతుంది. కార్డు జారీ అయితే వెంటనే మీ యాపిల్‌ వాలెట్‌లో ప్రత్యక్షమవుతుంది.

ఫిజికల్ కార్డు..

ఫిజికల్ కార్డు..

కార్డ్ సెటప్ చేసుకొనే సమయంలో యాపిల్ ఫ్యాన్సీ టైటానియం కార్డు కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అది తర్వాత మీ ఈ మెయిల్‌కు వస్తుంది. ఈ కార్డులో NFC ట్యాగ్ ఉంటుంది. ఓసారి ట్యాప్ చేసి వినియోగించవచ్చు.

దీంతో పాటు యాపిల్‌ మరో ఫిజికల్ కార్డును జారీ చేస్తుంది. ఇందులో కార్డు నెంబర్స్ మొత్తం ఒక చిప్‌లో నిక్షిప్తమై ఉంటాయి. యూజర్ల వ్యక్తిగత గోప్యతను రక్షించేందుకే యాపిల్‌ ఈ కార్డ్స్‌ను తీసుకొచ్చింది. యూజర్ల ట్రాన్సాక్షన్స్ అన్నీ ఐఫోన్‌లో నిక్షిప్తమవుతాయి. తొలుత అమెరికాలో అందుబాటులోకి వచ్చింది.

English summary

ఇన్విటేషన్ వస్తే లక్కీ! యాపిల్ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకోండి | The Apple credit card starts rolling out today

Apple on Tuesday began the initial deployment of its new branded credit card, sending out email invites to some of those who signed up to be notified that the card was indeed now available.
Story first published: Wednesday, August 7, 2019, 11:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X