భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ను ప్రోత్సహించేందుకు నెఫ్ట్ వేళల్లో మార్పులు చేసింది. ఇక డిసెంబర్ నుంచి రోజులో ఎప్పుడైనా నగదు లావాదేవీలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా మళ్లీ రెండు, నాలుగో శనివారాల్లో సేవలు ఉండవు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన పేమెంట్ సిస్టమ్ విజన్ డాక్యుమెంట్ 2021ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో డిసెంబర్ 2019 నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్) సేవలు రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. 24X7 అందుబాటులో ఉండే ఈ సేవల ద్వారా దేశ రిటైల్ పేమెంట్ సిస్టమ్.. పూర్తిస్థాయిలో మారబోతోందని ఆర్బీఐ భావిస్తోంది.

ఎందుకంటే.. సాయంత్రం వేళల్లో డబ్బులు ఇతర ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసే సౌలభ్యం లేదు. మరుసటి రోజు వరకూ ఆగాల్సి ఉండేది. దీంతో చాలా మంది సాయంత్రం తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కే ఎక్కువగా మొగ్గుచూపేవారు. ప్రధానంగా వ్యాపారస్థులకు ఇది మరింతగా లబ్ధి చేకూర్చబోతోంది. గూగుల్ పే, అమెజాన్ వంటి యూపీఐ సేవలు ఉన్నా జనాలు ఇప్పటికీ బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలు జరిపేందుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ నేపధ్యంలో ఆర్బీఐ తీసుకున్న ఈ చర్య బ్యాంకింగ్ రంగంలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications