ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం రెపో రేటును తగ్గించింది. 35 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 5.75 శాతం నుంచి 5.40 శాతానికి వచ్చింది. రివర్స్ రెపో రేటును 5.15 శాతానికి సవరించింది. జీడీపీ వృద్ధి రేటును 7 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది.
ఆర్బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు (0.35 శాతం) తగ్గించడంతో 5.4 శాతానికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 110 బేసిక్ పాయింట్స్ తగ్గినట్లు. రెపో రేటు తగ్గించడం వల్ల మార్కెట్లకు కొత్త ఊపు వస్తుంది. అలాగే బ్యాంకులు తమ తమ రుణ రేట్లను సవరించుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ రెపో రేటు ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలి.

ఈ కేలండర్ ఇయర్ (2019) ప్రారంభం నుంచి ఇప్పటికే ఆర్బీఐ మూడుసార్లు వడ్డీ రేటును తగ్గించింది. దీంతో 6.50 శాతంగా ఉన్న వడ్డీ రేటు 5.75కు తగ్గింది. మూడు పర్యాయాలు పావు శాతం చొప్పున తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2019-20) ఇది మూడో ద్వైమాసిక పరపతి సమీక్ష. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (MPC) సోమవారం నుంచి భేటీలు ప్రారంభించింది.
బుధవారం వడ్డీ రేట్ల తగ్గింపుపై మార్కెట్లు కూడా ఆశలు పెట్టుకున్నాయి. ఈ కారణంగానే గత కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు మంగళవారం లభాల్లోకి వచ్చాయి. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని మార్కెట్లు, ఆర్థిక నిపుణులు భావించారు. బుధవారం ఉదయం మార్కెట్లు స్వల్పనష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. ఆర్బీఐ పరపతి సమీక్ష ప్రకటనకు ముందు మాత్రం మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications