ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం మధ్యాహ్నం గం.11.45 నిమిషాలకు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్స్ అంటే పావు శాతం తగ్గించే అవకాశముందని భావిస్తున్నారు. ద్రవ్యల్బోణం అదుపుకు తోడు ఆర్థిక కార్యకలాపాల ఊతానికి ఆర్బీఐ రేట్లను తగ్గించవచ్చునని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఆర్బీఐ మూడో ద్వైమాసిక పరపతి సమీక్ష. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆటోమొబైల్ సేల్స్ తగ్గడం, మౌలికరంగ వృద్ధి దిగజారడం, రుతు పవనాలు, స్టాక్ మార్కెట్ల క్షీణతపై ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ రేట్ల కోతకు మొగ్గు చూపే అవకాశముందని అంచనా.

మంగళవారం నాడు మార్కెట్లు కూడా వడ్డీ రేట్ల కోత ఆశలతోనే తేరుకున్నాయి. కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్లకు నిన్న ఉపశమనం లభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసికపు సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందనే ఆశలతో ఈ రిలీఫ్ లభించింది. ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు చేశారు.
ఫలితంగా అయిదు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన సూచీలు ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. మంగళవారం ఓ దశలో 500 పాయింట్లకు పైగా లాభపడి 37 వేల పైకి చేరుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 36,976.85 వద్ద క్లోజ్ అయింది. సోమవారంతో పోలిస్తే 277.01 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 85.65 పాయింట్లు లాభపడి 10,948.25 వద్ద క్లోజ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications