ఊరందరిదీ ఓ దారైతే.. ఉలిపి కట్టెది మరో దారి అనేట్టు.. ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిన తరుణంలో మన స్టాక్ మార్కెట్ సూచీలు మాత్రం బలంగా నిలదొక్కుకున్నాయి. అమెరికా, యూరోప్, ఆసియా మార్కెట్లలో భారీ పతనాన్ని చూసిన నేపధ్యంలో మన సూచీలు కూడా ఈ రోజు షాక్‌కు గురికావాల్సిందేనని అనుకున్నారు. అయితే బలమైన షార్ట్ కవరింగ్ నేపధ్యంలో మన సూచీలు లాభాల్లో పయనించాయి. నిఫ్టీ మళ్లీ 11 వేల పాయింట్ల మార్కును దాటి పైకి పయనించింది. ఐటీ, మీడియా మినహా దాదాపు అన్ని రంగాల సూచీల నుంచి మద్దతు లభించడంతో నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 10948 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 277 పాయింట్లు పెరిగి 36976 వద్ద క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 28 వేల 22 దగ్గర స్థిరపడింది.
మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.23 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం లాభపడ్డాయి. ఇవి కాకుండా రియల్టీ, ప్రైవేట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో రంగ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా కనిపించింది.

ఇండియాబుల్స్ హౌసింగ్, యెస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్టైన్మెంట్, సిప్లా, రిలయన్స్, పవర్ గ్రిడ్, టిసిఎస్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.
టైటన్‌కు కలిసి రాలేదు
టైటన్ సంస్థ ఈ సారి కూడా త్రైమాసిక ఫలితాల్లో కాస్త వెనుకబడింది. ఆధాయంలో 14.4 శాతం, నికర లాభంలో 6.2 శాతం వృద్ధిని సాధించగలిగింది. ఇండస్ట్రీ అంచనాలను ఆకట్టుకోలేకపోవడంతో స్టాక్ ఫ్లాట్‌గా ముగిసింది. కేవలం 0.12 శాతం లాభంతో రూ.1038 దగ్గర క్లోజైంది.
డిహెచ్ఎఫ్ఎల్‌ను గాడిలోపెట్టే పని
అప్పుల్లో కూరుకుని, లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌కు స్పెషల్ ప్యానెల్ ఓ పరిష్కార నివేదికను అందజేసింది. ఎర్నస్ట్ అండ్ యంగ్‌తో చర్చించిన అనంతరం ఎక్స్ఛేంజీలకు అందిన ఈ ముసాయిదా నేపధ్యంలో స్టాక్ పైపైకి పరుగులు తీసింది. ఏకంగా ఒకే రోజు 32 శాతం లాభపడి రూ.55 దగ్గర క్లోజైంది.
ఏడో రోజూ.. ఏడుపే
జీ ఎంటర్‌టైన్మెంట్స్ స్టాక్ వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిసింది. అక్టోబర్ 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే వరుస పతనాలతో స్టాక్ కుదేలవుతోంది. ప్రత్యేక కారణమేదీ లేకపోయినప్పటికీ స్టాక్ ఈ రోజు ఇంట్రాడేలో 8 శాతం వరకూ నష్టపోయింది. చివరకు 6 శాతం నష్టాలతో రూ.312 దగ్గర క్లోజైంది.
అంచనాలను మించిన ఎస్ఆర్ఎఫ్
సంస్థ ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం 9.1 శాతం, నికర లాభం 42 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్జిన్లలో కొద్దిగా మార్పు ఉంది. ఒక్కో షేర్‌కు సంస్థ రూ.7 డివిడెండ్‌ను ప్రకటించింది. ఫ్లోరోపాలిమర్స్ సెగ్మెంట్లోకి సంస్థ అడుగు పెట్టబోతున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో రూ.424 కోట్లతో ప్రత్యేక సమీకృత కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు చెప్పింది. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్ 17 శాతం వరకూ పెరిగింది. చివరకు 15 శాతం లాభంతో రూ.2988 దగ్గర క్లోజైంది.
పిడిలైట్ పటిష్టం
ప్రముఖ ఫెవికాల్ బ్రాండ్ సంస్థ పిడిలైట్ ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో ఆదాయం 10 శాతం, నికర లాభం 23 శాతం వృద్ధి నమోదైంది. ఎబిటా 17 శాతం, మార్జిన్లు 22 శాతానికి చేరాయి. దీంతో స్టాక్ 3 శాతం పెరిగి రూ.1308 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications