ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. గత వారం మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాలతో పాటు ప్రస్తుతం కాశ్మీర్‌లోని అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఉదయం గం.9.30 నిమిషాలకు బాంబేస్టాక్ ఎక్స్చెంజ్ సెన్సెక్స్ 500 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 164 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.46 వద్ద ట్రేడ్ అవుతోంది.

పది గంటల సమయానికి సెన్సెక్స్ ఏకంగా 675 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 10,800 మార్క్‌కు దిగువకు పడిపోయింది. 2019 సంవత్సరంలో నిఫ్టీ పొందిన లాభాలను ఈ ఒక్కరోజుతో తుడిసిపెట్టేసేలా కనిపిస్తోంది. అయితే, కాసేపటికి నిఫ్టీ 10,800 మార్కు పైకి చేరుకుంది. సెన్సెక్స్ 550 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది.
సోమవారం ఉదయం HDFC, TCS, NTPC, HCL Tech, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్ కార్ప్, DHFL, LIC హౌసింగ్, ఇండియా బుల్స్ హౌసింగ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల్లో షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications