ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారం నిర్వహించనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్షపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గిస్తుందా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ కేలండర్ ఇయర్‌లో మూడుసార్లు వడ్డీ రేటును తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 6.50 శాతం నుంచి 5.75కు తగ్గింది. ఇప్పుడు మరోసారి తగ్గిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలా చేస్తే కనుక మరో 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తే 5.75 శాతం నుంచి 5.50 శాతం అవుతుంది.
ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉండటం వల్ల ఆర్బీఐ రెపో రేటును తగ్గించే అవకాశాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్న తరుణంలో వడ్డీ రేట్లు తగ్గిస్తే వృద్ధికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

గత జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి 5.8 శాతంగా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. జీడీపీ వృద్ధి మాత్రం వెనక్కి పోతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించి, ఇలాంటి నిర్ణయాలకు అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇచ్చింది. జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 3.18 శాతంగా ఉంది. ఆర్బీఐ లక్ష్యం 4 శాతం కంటే తక్కువ. ఏడాది కాలంగా ఇది అదుపులో ఉంది. రానున్న కాలంలోను మరీ పెరగకపోవచ్చు. ఆటో మొబైల్ అమ్మకాలు భారీగా తగ్గిపోతున్నాయి. బీమా ప్రీమియం, ఇంధనాల ధరల్లో పెరుగుదలతో పాటు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పరిశ్రమను దెబ్బతీస్తున్నాయి. ఇలా పలు కారణాల వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications