ఎలక్ట్రిక్ వాహనాలపై గుడ్‌న్యూస్: ఇన్సురెన్స్ ఇండస్ట్రీ అండ
పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (EV)ను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవలే జీఎస్టీ రేటును 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించింది. EVలు ఎకో ఫ్రెండ్లీ, పెరుగుతున్న పెట్రో ధరల నుంచి ఊరట, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు.. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. EVల ప్రోత్సాహానికి కేంద్రం కూడా నడుం బిగించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ప్రోత్సాహకాలు, తగ్గింపుల ద్వారా EVలను వేగవంగా పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇన్సురెన్స్ ఇండస్ట్రీ కూడా EVలను ప్రోత్సహించే జాబితాలో చేరింది.

థర్డ్ పార్టీ వెహికిల్స్ ప్రీమియం రేట్లలో 15 శాతం డిస్కౌంట్
2019-20 సంవత్సరానికి గాను ప్రయివేటు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు థర్ట్ పార్టీ ఇన్సురెన్స్ (TP) ప్రీమియం రేట్లలో 15 శాతం డిస్కౌంట్ ఉంటుందని ఇటీవల ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రకటించిందని డిజిటల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ సేల్స్ మార్కెటింగ్ హెడ్ అండ్ డైరెక్టర్ వివేక్ అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన, ప్రోత్సహించడానికి ఇలాంటివి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ తప్పనిసరి
ఈ పాలసీ జూన్ 2019 నుంచి అమలులోకి వచ్చింది. వివిధ ఛానల్స్, అండర్‌రైటింగ్ కార్యాలయాల ద్వారా ఇది అందుబాటులో ఉంది. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ తప్పనిసరి. ఇన్సూరర్ దీనిని కస్టమర్ కోసం అందుబాటులో ఉంచాలి. చవకైన TP రేట్లు ఈవీ అడాప్షన్ బిహేవియర్ పైన నేరుగా ప్రభావం చూపుతాయి. ఇదివరకు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా కేటగిరీ లేదు.

EVలపై ఇదీ లక్ష్యం
2030 నాటికి 30 శాతం ప్రయివేటు కార్లు, 80 శాతం టూ వీలర్స్, త్రీ వీలర్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ఎన్నో బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇలాంటి స్టెప్స్ భవిష్యత్తుకు ప్రయోజనకరమని చెబుతున్నారు. ఇప్పుడు IRDAI కూడా ఇన్సురెన్స్ కాస్ట్ కట్టింగ్ ద్వారా మద్దతుగా నిలుస్తోందని, ఈ నేపథ్యంలో భవిష్యత్తు కోసం మనమూ నిర్ణం తీసుకోవాలని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications