న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వాహనదారులకు షాకివ్వనుందా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. వెహికిల్ రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్తగా పెట్రోల్, డీజిల్ కారును రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇందుకు ఫీజుగా రూ.5,000, రిజిస్ట్రేషన్ రెవెన్యూ చేసుకోవడానికి రూ.10,000గా ప్రతిపాదించారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను(EV) ప్రోత్సహిస్తోంది. రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువగా ఉంటే EVడిమాండ్ పెరుగుతుందని అంచనా. రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ సిద్ధం చేసింది.

బైకులకు ఎంత పెరుగుతుందంటే?
కేంద్ర రోడ్డు రవాణా శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం ద్విచక్ర వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000గా ఉంటుంది. ప్రస్తుతం ఇది కేవలం రూ.50గా మాత్రమే ఉంది. అంటే 20 రెట్లు పెరిగినట్లు. రెన్యూవల్ అయితే రూ.2,000గా ఉంటుంది.

కార్లకు ఎంత పెరుగుతుందంటే?
కార్లు, జీపుల రిజిస్ట్రేషన్ ఫీజు రూ.10,000, రెన్యూవల్ ఫీజు రూ.20,000కు పెరగనుంది. ప్రస్తుతం ఈ ఛార్జీలు రూ.1,000గా ఉన్నాయి. అంటే రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ఫీజు వరుసగా పది రెట్లు, ఇరవై రెట్లు పెరగనుంది.

ఇంపోర్టెడ్ కార్లు, జీపులకు ఎంత పెరుగుతుందంటే?
ఇంపోర్టెడ్ కార్లు, జీపులకు రిజిస్ట్రేషన్ రూ.40,000గా పెంచాలని ప్రతిపాదించారు. మోటార్ సైకిల్స్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.20,000గా పెంచే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం వీటి ఫీజు రూ.5,000, రూ.2,500గా ఉంది. పరిశ్రమ సంబంధిత వర్గాలు 45 రోజుల్లో కొత్త ప్రతిపాదనలకు సంబంధించి వారి సూచనలు తెలియజేయవచ్చు.

ఏ వెహికిల్స్‌కు ఎంత శాతం (రిజిస్ట్రేషన్) పెరుగుతుందంటే?
ప్రతిపాదించిన రిజిస్ట్రేషన్ ఫీజుల పెరుగుదల శాతం ఇలా ఉంటుంది.
- టూ వీలర్స్ - 50 నుంచి 1,000 - 1900%
- త్రీ వీలర్స్ - 300 నుంచి 5,000 - 1567%
- కార్లు/జీపులు - 600 నుంచి 5,000 - 733%
- కమర్షియల్ వెహికిల్స్ - 1,000 నుంచి 10,000 - 900%
- మీడియం అండ్ హెవీ వెహికిల్స్ - 1,500 నుంచి 20,000 - 1233%

ఏ వెహికిల్స్‌కు ఎంత శాతం (రెన్యూవల్) పెరుగుతుందంటే?
ప్రతిపాదించిన రెన్యూవల్ ఫీజుల పెరుగుదల శాతం ఇలా ఉంటుంది.
- టూ వీలర్స్ - 50 నుంచి 2,000 - 3900 %
- త్రీ వీలర్స్ - 300 నుంచి 10,000 - 3233%
- కార్లు/జీపులు - 600 నుంచి 15,000 - 2400 %
- కమర్షియల్ వెహికిల్స్ - 1,000 నుంచి 20,000 - 1900%
- మీడియం అండ్ హెవీ వెహికిల్స్ - 1,500 నుంచి 40,000 - 2567%


Click it and Unblock the Notifications