న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్లు గురువారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 11,000 దిగువకు వచ్చింది. మెటల్, మీడియా, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. ప్రమోటర్ వాటా 11 శాతం వాటా విక్రయం కారణంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ టాప్ లూజర్‌గా నిలిచింది. వేదాంత, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో, టాటా మోటార్స్, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్ టెల్, విప్రో, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వీసెస్ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఎస్బీఐ ఆరు శాతం మేర నష్టపోయింది.
యూఎస్ ఫెడరల్ బ్యాంకు బుధవారం సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ సమయంలో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన కామెంట్స్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో యూఎస్ మార్కెట్ నిలువునా పతనమైంది. సమీక్ష సందర్భంగా ఫెడ్ చైర్మన్ మాట్లాడుతూ.. సుదీర్ఘ రేట్ కట్ సైకిల్‌కు తాజా నిర్ణయం ఆరంభం కాదన్నారు. తద్వారా ప్రస్తుత తగ్గింపు తర్వాత రేట్ కట్స్ ఉండకపోవచ్చునని వెల్లడించారు.

ఫెడ్ చైర్మన్ మాటలు పదేళ్ల తర్వాత తీసుకున్న రేట్ కట్ నిర్ణయ సంబరాలను ఆవిరి చేశాయని చెబుతున్నారు. ఇది మార్కెట్లో సెంటిమెంట్‌పై నెగిటిన్ ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో డౌజోన్స్, నాస్‌డాక్, ఎస్ అండ్ పీ పతనమయ్యాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్ల పైన కూడా పడింది.
అయితే ఫెడ్ చైర్మన్ ఇది చివరి రేట్ కట్ అని చెప్పలేదని, మార్కెట్లు అనవసరంగా నెగిటివ్‌గా తీసుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలతో డాలర్ బలపడటం వర్ధమన మార్కెట్లకు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. మొత్తానికి పెడ్ రేట్ కట్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలతో అమెరికా, ఆసియా మార్కెట్లతోపాటు ఇండియన్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది.
More From GoodReturns

Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్లో లాభాల పంట! మాన్సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications