స్టాక్ మార్కెట్లో మరో భారీ పతనం. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 200 పాయింట్లకుపైగా పతనాన్ని చవిచూసింది నిఫ్టీ. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు 650 పాయింట్ల వరకూ కుప్పకూలాయి. నిఫ్టీ వారం రోజుల్లోనే వెయ్యి పాయింట్లకు పైగా హరించుకుపోయింది. అమెరికన్ ఫెడ్ రిజర్వ్ పావు శాతం వడ్డీ రేట్లను తగ్గించడం, చైనా- అమెరికా వాణిజ్య చర్చలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై అనుమానాలు మార్కెట్ సూచీలను నష్టాల్లో ముంచాయి. ఉదయం 11060 పాయింట్ల దగ్గర స్వల్ప నష్టాలతో ప్రారంభమైన నిఫ్టీ.. మిడ్ సెషన్ తర్వాత 10881 పాయింట్ల కనిష్టానికి దిగొచ్చింది. ఇంట్రాడే గరిష్టం నుంచి ఇది 200 పాయింట్లు పడిపోయింది. అయితే ఆఖరి అరగంటలో కొద్దిగా కొనుగోలు మద్దతు లభించడంతో సుమారు 100 పాయింట్లు రికవర్ అయింది నిఫ్టీ. ఈ రోజు ఫ్యూచర్స్ వీక్లీ ఎక్స్‌పైరీ కూడా ఉండడంతో ఒడుదుడుకులు మరింత ఎక్కువయ్యాయి. చివరకు నిఫ్టీ 138 పాయింట్లు కోల్పోయి 10980 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 37018 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 509 పాయింట్ల నష్టంతో 28367 దగ్గర స్థిరపడింది.
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ ఒకటిన్నర శాతం వరకూ నష్టపోయాయి. ఈ రోజు ఒక్క ఆటో మినహా అన్ని రంగాల సూచీలూ భారీ పోటుకు గురయ్యాయి. ముఖ్యంగా మెటల్ రంగ షేర్లు కరిగిపోయాయి. వీటికి తోడు మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

మారుతి, విప్రో, ఇన్ఫ్రాటెల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఆఖర్లో రిలయన్స్ లాభపడడం మార్కెట్లను పైకి తీసుకువచ్చింది. వేదాంతా, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ, టాటా మోటార్స్, హిందాల్కో లూజర్స్ జాబితాలో చేరాయి.
మిడ్, స్మాల్ క్యాప్ మటాష్
మిడ్, స్మాల్ సూచీలు గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా పతనమయ్యాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ టైం హై స్థాయి నుంచి 28 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ టైం హై నుంచి 43 శాతం పతనమయ్యాయి. ఐదేళ్లలో ఈ స్థాయి పతనం ఈ మధ్యకాలంలో ఇప్పుడే చూస్తున్నాం.
52 వారాల కనిష్టానికి 400 స్టాక్స్
మార్కెట్లు ఈ పరిస్థితిలో ఉంటే.. 52 వారాల కనిష్టాన్ని తాకే స్టాక్స్ జాబితా కూడా పెరుగుతోంది. ఈ రోజు 407 స్టాక్స్ ఈ జాబితాలో చేరాయి. ఆర్తి డ్రగ్స్, ఆసిల్యా కాలే, ఆల్ఫాజియో, అపార్ ఇండస్ట్రీస్, అర్వింద్ ఫ్యాషన్స్, అశోక్ లేల్యాండ్, బాలాజీ అమైన్స్, అతుల్ ఆటో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బేయర్ క్రాప్, బ్లూడార్ట్, కేర్ రేటింగ్స్, సియట్, కాఫీ డే, క్రిసిల్, డెల్టా కార్ప్, ఐషర్ మోటార్స్, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హిందాల్కో, హెరిటేజ్ ఫుడ్స్, లక్ష్మీ మెషీన్ వర్క్స్, మోన్‌శాంటో, శంకర్ బిల్డ్‌కాన్, టైడ్ వాటర్, టీవీఎస్ శ్రీచక్ర వంటి సంస్థలున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications