భారత స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తున్నాయి. కొంత కాలంగా అలుపు అనేదే లేకుండా అదే పనిగా పడుతూ పోతున్నాయి. అదే సరళిని కొనసాగిస్తూ ఈ రోజు (ఆగష్టు 1) ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద అక్షరాలా ఒక లక్ష అరవై వేల కోట్లు ఆవిరి చేశాయి. దీంతో ఆమ్మో ఒకటో తారీఖు అనే సినిమా టైటిల్ గుర్తుకు తెప్పించాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అంటేనే వెన్నులో వణుకు వచ్చేంత తీవ్ర స్థాయిలో షేర్లు పడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్త పరిణామాలకు తోడు దేశంలో మందగమనం నెలకొంటుందని భయాలు తీవ్రమైన వేళ అటు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీలు నేల చూపులు చూశాయి. ఇంట్రా డే లో BSE సెన్సెక్స్ 787 పాయింట్లు పతనమై కంగారు పెట్టింది. చివరకు కొంత కోలుకొని 463 పాయింట్ల (1.23%) నష్టంతో ముగిసింది. నిఫ్టీ సైతం తన 11,000 పాయింట్ల మద్దతును కోల్పోయి 10,980 వద్ద క్లోజ్ ఐంది. దీంతో 138 పాయింట్లు (1.24%) కోల్పోయినట్లైంది.
బడ్జెట్ నుంచి రూ 13.70 లక్షల కోట్ల నష్టం ...
జులై 5 న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు రూ 13.70 లక్షల కోట్లు నష్ట పోయారు. ఇది ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లలో వచ్చిన నష్టాల్లో అతి పెద్ద రికార్డుల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తున్నట్లు ప్రకటించటం మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది. దీంతో రూపాయి తో డాలర్ బలపడింది. తోలి త్రిమాషికంలో కార్పొరేట్ కంపెనీల రిజల్ట్స్ ఆశించిన మేరకు లేకపోవడం, ఆటోమొబైల్ అమ్మకాలు క్షీణిస్తుండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. దేశం మందగమనం వైపు పయనిస్తోందని ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నారు. బడ్జెట్ లో సంపన్నులపై అధిక పన్నులు విధించటం కూడా మార్కెట్లకు నెగెటివ్ ఫోర్స్ గా మారిందని అనలిస్టులు పేర్కొంటున్నారు.

52 వారాల కనిష్ట స్థాయికి 541 స్టాక్స్ ..
స్టాక్ మార్కెట్ల పతనం ఏ స్థాయిలో ఉందంటే... ఏకంగా 541 కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకొన్నాయి. ఇందులో దిగ్గజ కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, వేదాంత, బ్యాంకు అఫ్ ఇండియా, బయో కాన్, సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా, ఎస్కార్ట్స్ వంటి బడా కంపెనీలకూ ఈ దెబ్బ తప్పలేదు. ఇంట్రాడే లో 265 కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. ఇందులో కాక్స్ అండ్ కింగ్స్, ఇండియా బుల్స్, కాఫీ డే ఎంట్రప్రెస్స్ , మన్ పసందు బెవరేజెస్ వంటి అనేక ప్రముఖ కంపెనీలు ఉన్నాయ్.
పెరిగిన రిలయన్స్ షేర్లు...
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈ రోజు బేరిష్ ట్రెండ్ ను తట్టుకొని నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.25% పెరిగి రూ 1,180 వద్ద క్లోజ్ అయ్యాయి. కాగా, ఎయిర్టెల్ షేర్లు 4% పతనమయ్యాయి. భారీ నష్టాలను ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ఎయిర్టెల్ షేర్లు 4.10% పడిపోయి రూ 323.95 వద్ద క్లోజ్ అయ్యాయి. మార్కెట్ అనంతరం తోలి త్రైమాషిక ఫలితాలు వెల్లడించిన ఎయిర్టెల్... ఏకంగా రూ 2,866 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాషికంలో కంపెనీ రూ 97 కోట్ల నికర లాభాన్ని ఆర్జించటం విశేషం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications