హైదరాబాదీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ భారీ స్థాయిలో వృద్ధిని సాధించాలని అనుకుంటోంది. సొంతంగా వ్యాపారాన్ని పెంచుకోవడమే కాకుండా ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించాలని భావిస్తోంది. వేగవంతంగా వృద్ధిని నమోదు చేసుకునేందుకు ఇతర కంపెనీలను లేదా ఎక్కువ అమ్మకాలు ఉండే ఔషధాలను కొనుగోలు చేయడమే కంపెనీ ముందున్న తక్షణ మార్గంగా ఉంది. డాక్టర్ రెడ్డీస్ కు భారత మార్కెట్ తో పాటు అమెరికా, యూరప్, చైనా, రష్యా దేశాలు ముఖ్యమైన మార్కెట్లుగా ఉన్నాయి. ఈ మార్కెట్లలో వ్యాపార అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీకి అప్పులు మరీ అంతగా లేదు. కాబట్టి అవసరమైతే సులభంగా నిధులు సమకూర్చుకొని కొనుగోళ్లపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. కంపెనీ కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
లాభాల్లో జోరు...
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) జూన్ తో ముగిసిన మొదటి త్రైమాసికానికి డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 663 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది.
* క్రితం ఆర్థిక సంవత్సరం (2018-19) జూన్ త్రైమాసికం (రూ. 456 కోట్లు ) తో పోల్చితే లాభం 45.31 శాతం పెరగడం విశేషం.
* సమీక్ష త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 3,721 కోట్ల నుంచి రూ. 3,844 కోట్లకు పెరిగింది.
* ఉత్తర అమెరికాలో కంపెనీ ఆదాయాలు 3 శాతం, రష్యాలో 5 శాతం, సి ఐ ఎస్ దేశాలు-రుమేనియా ఆదాయాలు 2 శాతం, యూరప్ ఆదాయాలు 19 శాతం మేర పెరిగాయి. మనదేశంలో ఆదాయాలు 15 శాతం పెరగడం విశేషం.
* గత జూన్ 30 నాటికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యు ఎస్ ఎఫ్ డీ ఏ ) వద్ద పెండింగ్ లో ఉన్న జనరిక్ ఔషదాల దరఖాస్తులు 107 వరకు ఉన్నాయి.
* జూన్ త్రైమాసికంలో కంపెనీ 5 కొత్త ఔషధాలను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది.
* కంపెనీ పరిశోధన, అభివృద్ధి వ్యయాలు మొదటి త్రైమాసికంలో రూ. 360 కోట్లు గా ఉన్నాయి.
* ప్రస్తుతం ఈ కంపెనీలో ఇరవై వేల వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు.
* కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్న ఎరేజ్ ఇజ్రాయిలీ కి పదోన్నతి కల్పించి సీఈవోగా నియమించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి అయన కొత్త పదవీ భాద్యతలు స్వీకరిస్తారు.

షేరు ధరపై ఆశావహం
* గత మూడు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే డాక్ట ర్ రెడ్డీస్ షేరు ధర తగ్గుముఖంలో ఉంది.
* బుధవారం నాడు ఈ షేరు ధర రూ. 2,568 స్థాయిలో కదలాడింది.
* అయితే రానున్న కాలంలో షేరు ధర పెరగడానికి అవకాశం ఉందని హెచ్ డీ ఎఫ్ సి సెక్యూరిటీస్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications