భారత్ లో అత్యంత సంపన్నుడు ఐన ముకేశ్ అంబానీ కి చెందిన రిలయన్స్ రిటైల్ కంపెనీపై పై అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కన్ను పడింది. గ్రోసరీస్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫాషన్ ఉత్పత్తులు విక్రయించే రిటైల్ స్టోర్ల చైన్ రిలయన్స్ రిటైల్. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లోనూ రిలయన్స్ రిటైల్ స్టోర్లు ఉన్నాయ్. ఇండియా లో ఈ కామర్స్ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసేందుకు, ఓమ్ని ఛానల్... అంటే, ఆన్లైన్, ఆఫ్ లైన్ వ్యాపారాన్ని కలిగి ఉండటం, బిజినెస్ కు రిలయన్స్ రిటైల్ కొనుగోలు బాగా ఉపకరిస్తుందని అమెజాన్ తలపిస్తోంది. అందుకే ఈ కంపెనీ లో సుమారు 26% వాటాను కొనుగోలు చేసేందుకు అమెజాన్ ఇప్పటికే రిలయన్స్ రిటైల్ తో ముమ్మర చర్చలు జరుపుతోందని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో వెల్లడించింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. అన్నీ అనుకూలిస్తే వీలైనంత త్వరగా ఈ డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నారు.

వాల్యుయేషన్ కుదరకే...
నిజానికి రిలయన్స్ రిటైల్ లో వాటా కొనుగోలు చేసేందుకు చైనా కుబేరుడు జాక్ మా కు చెందిన అలీబాబా గ్రూప్ కూడా గతం లో ఆసక్తి కనబరిచింది. బిగ్ బాస్కెట్, పేటీఎం వంటి కంపెనీల్లో భారీగా పెట్టుబడి పెట్టిన అలీబాబా ... ఆఫ్ లైన్ రంగంలోనూ పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యం లోనే రిలయన్స్ రిటైల్, అలీబాబా మధ్య సంప్రదింపులు జరిగాయి. అయితే, రిలయన్స్ రిటైల్ వాల్యుయేషన్ విషయం లో ఇరు కంపెనీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, అందుకే డీల్ జరగలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, అమెజాన్ ప్రస్తుతం రంగంలోకి దిగిందని చెబుతున్నారు. ఫ్లిప్కార్ట్ ను వాల్ మార్ట్ కొనుగోలు చేయడంతో దానికి... అటు ఆన్లైన్, ఇటు ఆఫ్ లైన్ ప్రెసెంచె ఏర్పడింది. బెస్ట్ ప్రైస్ బ్రాండ్ నామ తో వాల్ మార్ట్ ఇప్పటికే ప్రధాన నగరాల్లో హోల్ సేల్ రిటైల్ స్టోరీలను నిర్వహిస్తోంది. దీంతో పోటీ పడాలంటే సమర్ధవంతమైన, అధిక నెట్వర్క్ మిలిగిన సంస్థతో జట్టు కట్టాలని అమెజాన్ భావిస్తోంది. ఇదిలా ఉండగా, రిలయన్స్ రిటైల్ మాత్రం ... మార్కెట్ ఊహాగానాలపై స్పందించలేమని, ఈ డీల్ పై ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.

10,600 స్టోర్లు ....
రిలయన్స్ రిటైల్ ప్రస్థానం దేశంలో చాలా పటిష్టంగానే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లోనూ పాగా వేసింది. రిలయన్స్ రిటైల్ కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,700 నగరాలూ, పట్టణాల్లో 10,644 స్టోర్లు ఉన్నాయ్. 2.3 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని కలిగి ఉంది. రిలయన్స్ రిటైల్ బ్రాండ్ లో ఎలక్ట్రానిక్స్, గ్రోసరీస్, ఫాషన్, లైఫ్ స్టైల్ విభాగాలు కలిగి ఉన్నాయ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం వ్యాపారంలో వీటి వాటా రూ 73,508 కోట్లు అని పింక్ పేపర్ వెల్లలడించింది. ఇది మొత్తం వ్యాపారం లో 56 శాతానికి సమానమని తెలిపింది. అందుకే, ఇంతటి నెట్వర్క్ కలిగిన రిలయన్స్ రిటైల్ లో పెట్టుబడి పెడితే, అమెజాన్ లో అనేక విభాగాలకు ఇవి ప్రోడక్ట్ లను సరఫరా చేయగలుగుతాయని, వేగంగా డెలివరీ చేసేందుకు స్టాక్ సిద్ధంగా ఉంటుందని అమెజాన్ భావిస్తోంది.

రుణాలు తీర్చేందుకేనా...
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశం లోనే అతిపెద్ద కంపెనీ. పెట్రోలియం ఉత్పత్తులను విక్రయం ద్వారా పెద్ద ఎత్తున ఈ కంపెనీకి ఆదాయం, నికర లాభాలు అందుతాయి. కనే అదే స్థాయిలో కంపెనీకి అప్పులు కూడా ఉన్నాయ్. సొంత కంపెనీ విస్తరణ కోసం, అనుబంధ కంపెనీల్లో పెట్టుబడుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాలు సేకరించింది. ప్రస్తుతం ఈ రుణాలు ఏకంగా రూ 2.8 లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. అందుకే అనుబంధ కంపెనీ ఐన రిలయన్స్ రిటైల్ లో కొంత వాటా విక్రయం ద్వారా వచ్చే నిధులను రుణాల తిరిగి చెల్లింపునకు వినియోగించవచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ తలపోస్తున్నట్లు సమాచారం.

మోర్ సూపర్ మార్కెట్ కూడా...
ఆదిత్య బిర్లా గ్రూప్ నాకు చెందిన మోర్ సూపర్ మార్కెట్ చైన్ ను అమెజాన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మల్టీ బ్రాండ్ రిటైల్ లో 51% వాటాను విదేశీ కంపెనీలు కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తోంది. కానీ యాజమాన్య హక్కులను మాత్రం ఇవ్వదు. ఈ దేశ పౌలును మాత్రమే ఇలాంటి కంపెనీల యాజమాన్య బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. అందుకే, అమెజాన్ పరోక్ష పధ్ధతి లోనే మోర్ సూపర్ మార్కెట్ ను కొనుగోలు చేసింది. గ్రోసరీ డెలివరీ, హైపేర్లోకాల్ సేవలు విస్తరించే దిశగా అమెజాన్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమం లో అందిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకొంటోంది. కాబట్టి, రిలయన్స్ రిటైల్ లోనూ మైనారిటీ వాటాను చేజిక్కించుకొని, తన ప్రస్థానాన్ని మరింతగా పటిష్టపరుచుకునే పనిలో పడిందని నిపుణులు పేర్కొంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications