For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీజీ సిద్ధార్థను విశ్వసించాం, CCDలో 6% వాటా ఉంటుంది: KKR

|

బెంగళూరు: కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని ఇప్పటికే గుర్తించారు. ఆన సోమవారం రోజు నేత్రావతి నది బ్రిడ్జి వద్ద అదృశ్యమయ్యారు. ఆయన కోసం ఒకరోజుకు పైగా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన మృతికి ముందు... అదృశ్యంపై ప్రముఖ గ్లోబల్ బయ్యవుట్ మేజర్ KKR ఓ ప్రకటన విడుదల చేసింది.

బిజినెస్ ఫెయిల్యూర్ అంటూ ఉద్యోగులకు కాఫీడే ఓనర్ లేఖబిజినెస్ ఫెయిల్యూర్ అంటూ ఉద్యోగులకు కాఫీడే ఓనర్ లేఖ

పాపులర్ కేఫ్ కాఫీ డే (CCD)లో తాము తొమ్మిదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టామని, అందులో కొంత శాతాన్ని గత సంవత్సరం వెనక్కి తీసుకున్నామని, మిగతా పెట్టుబడి అలాగే ఉంటుందని KKR ఆ ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు CCDలో పెట్టుబడి 10.3 శాతంగా ఉందని, దీనిని 6 శాతానికి కుదించామని, ఇది అలాగే ఉంటుందని తెలిపింది.

 We believe in VG Siddhartha, still own 6% in CCD: KKR

వీజీ సిద్ధార్థ గురించి స్పందిస్తూ.. ఇది బాధాకరమైన విషయమని, ఆయన కుటుంబ సభ్యులు నిబ్బరంగా ఉండాలని, మా ఆలోచనలు వారి గురించే అని, తాము వీజీ సిద్ధార్థను విశ్వసించి తొమ్మిదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టామని తెలిపింది.

కాఫీ డే అధినేత మిస్సింగ్, బ్రిడ్జిపై కారు ఆపి..కాఫీ డే అధినేత మిస్సింగ్, బ్రిడ్జిపై కారు ఆపి..

సాధారణంగా ప్రయివేటు ఈక్విటీ ఫండ్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్‌గా ఉంటారు. ఏడాది నుంచి ఏడేళ్ల వరకు పెట్టుబడి పెట్టి, కంపెనీ ఎదుగుదలకు సహకరించి, ఆ తర్వాత వైదొలుగుతారు. అంటే పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు.

వీజీ సిద్ధార్థతో సంబంధం ఉన్న ఏ ఇతర కంపెనీలతోను తమకు సంబంధం లేదని మోర్టగేజ్ దిగ్గజం HDFC తెలిపింది. బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్కు ప్రాజెక్టు కోసం CCDకి లీజర్ రెండల్ డిస్కౌంటింగ్ లోన్స్ ఇచ్చినట్లు తెలిపింది. ఈ లోన్స్ అన్నింటిని 2019 జనవరిలోపు చెల్లించారని తెలిపింది. జనవరి నుంచి సంబంధం లేదని అభిప్రాయపడింది.

English summary

వీజీ సిద్ధార్థను విశ్వసించాం, CCDలో 6% వాటా ఉంటుంది: KKR | We believe in VG Siddhartha, still own 6% in CCD: KKR

Global buyout major KKR has said it is "deeply saddened" by the disappearance of VG Siddharth, the promoter of its investee company the coffee chain Cafe Coffee Day since Monday evening.
Story first published: Wednesday, July 31, 2019, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X