ఇంతకాలం నష్టాల్లో కొట్టుమిట్టాడిన మార్కెట్లు ఎట్టకేలకు ఈ రోజు కాస్త తేరుకున్నాయి. ఇంట్రాడేలో తీవ్ర ఒడుదుడుకులకు లోనైన నిఫ్టీ చివరకు లాభాల్లో ముగిసింది. ఈ రోజు ట్రేడ్‌లో నిఫ్టీ ఒక దశలో 11000 పాయింట్ల దిగువకు పడిపోయింది. మళ్లీ అక్కడి నుంచే రెట్టించిన ఉత్సాహంతో తేరుకుని మిడ్ సెషన్ తర్వాత 11,100 పాయింట్ల మార్కును దాటింది. ప్రధానంగా మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను దౌడు తీయించాయి. చివరకు నిఫ్టీ 33 పాయింట్ల లాభపడి 11,118 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 84 పాయింట్లు పెరిగి 37481 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో 28876 దగ్గర క్లోజైంది.
అయితే జూలై నెలలో పరమ చెత్త రికార్డును సొంతం చేసుకుంది నిఫ్టీ. 2002 తర్వాత అత్యంత మళ్లీ ఇప్పుడే అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి మార్కెట్లు. యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హీరోమోటోకార్ప్, టాటా స్టీల్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, యాక్సిస్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, టైటన్, భారతి ఇన్ఫ్రాటెల్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి. ఇక సూచీల పరంగా చూస్తే.. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం వరకూ పెరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, రియాల్టీ రంగ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి నమోదైంది. ఆటో, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలల్లో లాభాలు కొనసాగాయి.

ఐఓసీకి రిజల్ట్స్ బూస్ట్
త్రైమాసిక ఫలితాల్లో ఆధాయంలో 4.2 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది ఇండియన్ ఆయిల్. నికర లాభం ఏకంగా 41 శాతం తగ్గింది. మార్జిన్లు నీరసించాయి. మార్జిన్లు కూడా 8.6 నుంచి 6.35 శాతానికి తగ్గాయి. అయినప్పటికీ స్టాక్ మాత్రం ఐదు శాతం వరకూ లాభపడింది. చివరకు స్టాక్ 4.3 శాతం నష్టంతో రూ.139.30 దగ్గర క్లోజైంది.
కాఫీడేకి కొత్త ఛైర్మన్
విజి సిద్ధార్థ్ ఆత్యహత్య ఉదంతం తర్వాత కాఫీ డే బాధ్యతలను మోసేందుకు తాత్కాలిక ఛైర్మన్‌గా ఎస్. వి. రంగనాధ్‌ను నియమించింది బోర్డ్. ఇప్పుడున్న కష్టకాలం నుంచి సంస్థను గట్టెక్కించేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలు అన్వేషించేందుకు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వివిధ కారణాలతో స్టాక్ మరో 20 శాతం దిగొచ్చింది. చివరకు 20 శాతం నష్టంతో రూ.123 దగ్గర క్లోజైంది.
జీ ఎంటర్‌టైన్మెంట్ డౌన్
జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర.. సెబీ ఛైర్మన్‌తో భేటీ అయి తమ సంస్థ ప్రణాళికలను వివరించారని, అప్పుల భారం, రుణదాతలతో వాళ్లు కుదుర్చుకున్న ఒప్పందం వంటి అంశాలు మాట్లాడినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపధ్యంలో స్టాక్ 6 శాతం నష్టపోయింది. చివరకు రూ.361 దగ్గర క్లోజైంది.
600 స్టాక్స్‌కు పోటు
ఈ రోజు 588 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. మిడ్, స్మాల్, మైక్రో క్యాప్, బ్లూచిప్ అనే తేడా లేకుండా ఈ స్టాక్స్ అన్నీ కుప్పకూలాయి. ఈ జాబితాలో అపెక్స్ ఫ్రోజెన్, అపోలో మైక్రో, అర్వింద్ మిల్స్, అరబిందో ఫార్మా, బాలక్రిష్ణ ఇండస్ట్రీస్, బిఏఎస్ఎఫ్, భారత్ ఫోర్జ్, గ్లెన్ ఫార్మా, గోద్రెజ్ ఆగ్రోవెట్, హెరిటేజ్, ఐఎఫ్‌బి ఆగ్రో, లక్ష్మీ మెషీన్ వర్క్స్ వంటి సంస్థలున్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications