ఒత్తిడి వల్లే సిద్ధార్థ ఆత్మహత్య: బ్యాంకులపై తప్పుబట్టిన మాల్యా
లండన్: కేఫ్ కాఫీ డే (CCD) యజమాని వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై విజయ్ మాల్యా స్పందించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు. ఆత్మహత్యకు ముందు సిద్ధార్థ కంపెనీ ఉద్యోగులు, బోర్డు ఉద్యోగులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. మాల్యా ఈ లేఖను ప్రస్తావిస్తూ ప్రభుత్వం, బ్యాంకుల వైపు వేలెత్తి చూపించే ప్రయత్నాలు చేశాడు.
సిద్ధార్థ ఉదంతమే ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు నిదర్శనమని ఆరోపించారు. తనను కూడా ఇలాగే వేధిస్తున్నారన్నారు. తనకు వీజీ సిద్ధార్థతో పరోక్ష సంబంధాలు ఉన్నాయని, చాలా మంచివ్యక్తి అని, తెలివైన ఎంటర్‌ప్రెన్యూయర్ అన్నారు. ఆయన రాసిన లేఖలోని అంశాలను చూసి తీవ్ర నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు.

ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నిరాశకు గురిచేయగలవన్నాడు. బకాయిలన్నీ తిరిగి చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ తన విషయంలో వారు ఎలా వ్యవహరిస్తున్నారో చూడాలన్నారు. వెస్టర్న్ కంట్రీలలో అయితే అప్పులను తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వాలు, బ్యాంకులు సహాయం చేస్తాయని చెప్పాడు. కానీ తన విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పాడు. తాను రుణాలు చెల్లిస్తానని చెప్పినప్పటికీ, తన ప్రత్యామ్నాయాలన్నింటినీ అడ్డుకుంటున్నాడు. కాగా, బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మాల్యా లండన్‌లో తలదాడుకుంటున్న విషయం తెలిసిందే.
రెండు రోజుల క్రితం అదృశ్యమైన కాఫీడే యజమాని వీజీ సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నది నది వద్ద లభ్యమైన విషయం తెలిసిందే. ఆయన ఆత్యహత్య చేసుకున్నారు. సోమవారం అదృశ్యమైన ఆయన నేత్రావతి నదిలో దూకినట్లుగా ఓ జారి వెల్లడించారు. సిద్ధార్థ కోసం జాలర్లు, గజఈతగాళ్లు, అధికారులు తీవ్రంగా గాలించారు. చివరకు విగతజీవిగా కనిపించారు. ఆయన అంతకుముందే ఉద్యోగులకు, బోర్డు మెంబర్స్‌కు లేఖ రాశారు.


Click it and Unblock the Notifications