బెంగళూరు: కేఫ్ కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కార్పోరేట్ రంగానికి కాఫీ రుచి చూపించిన ఈ వ్యాపారవేత్త.. విజయవంత వ్యాపారి. కానీ తాను ఫెయిలైన బిజినెస్‌మెన్ అంటూ దారుణ నిర్ణయం తీసుకున్నారు. 2019 మార్చి నాటికి కాఫీ డే రుణ భారం రూ.6,547 కోట్లకు ఎగబాకింది. రుణబారం తగ్గించుకునేందుకు మైండ్ ట్రీలో తన వాటాను విక్రయించారు.

సిద్ధార్థ ఫ్యామిలీ వాటా...
సిద్ధార్థ ఫ్యామిలికీ కాఫీ డే ఎంటర్ ప్రైజెస్‌లో 53.43శాతం వాటా ఉంది. ఇందులో 75 శాతం వాటాలు తాకట్టులో ఉన్నాయి. వ్యక్తిగతంగా అయితే సిద్ధార్థకు 32.75 శాతం వాటా ఉంది. ఇందులో కూడా 70 శాతం తాకట్టులో ఉంది. ఈ క్రమంలో సిద్ధార్థ మే3 తేదీ నాటికి మైండ్ ట్రీలో కాఫీ డేకు ఉన్న వాటాలను పూర్తిగా విక్రయించారు. దీంతో రూ.2,100 నిధులు సమకూరాయి. ఈ సందర్భంలో వీజీ సిద్ధార్థ మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా ఉన్న రూ.600 కోట్ల అప్పును, కాఫీ డే రుణాలను ఈ సొమ్ముతో తీర్చినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా మైండ్ ట్రీలో 3.33 శాతం వాటాల్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

వీజీ సిద్ధార్థ జర్నీ ఇలా ప్రారంభం...
వీజీ సిద్ధార్థ 1983-84లో జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన జర్నీని ప్రారంభించారు. అతను అక్కడ రెండేళ్ల పాటు పని చేసిన తర్వాత బెంగళూరుకు వచ్చారు. స్టాక్ మార్కెట్లో రూ.30,000 ఇన్వెస్ట్ చేశారు. శివన్ సెక్యూరిటీస్ అనే సంస్థతో కలిసి పని చేశారు. 1985లో అతను 10,000 ఎకరాల కాఫీ ఫార్మ్స్‌ను సొంతం చేసుకున్నారు.

30వేల మంది ఉద్యోగులు
1996లో తొలి కాఫీ డే ఔట్ లెట్ ప్రారంభించారు. ఈ కంపెనీలో 30,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. చిక్‌మగళూరులో అతిపెద్ద కాఫీ ఎస్టేట్ ఉంది. కాఫీ వ్యాపారంతో పాటు సిద్ధార్థకు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. సికల్ లాజిస్టక్స్, కాఫీ డే నేచురల్ రీసోర్స్ ప్రైవేట్ లిమిటెడ(ఆర్థిక సేవలు), టాంగ్లిన్ డెవలప్‌మెంట్ లిమిటెడ్(రియల్ ఎస్టేట్), కాఫీ డే గ్లోబల్(కాఫీ రిటైల్), కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ (ఆతిథ్య రంగం), కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్ (పెట్టుబడుల) ఉన్నాయి.

ఇలా ఒత్తిడి పెరిగింది
మార్చిలో కాఫీ డే ప్రమోటర్ల వాటా విలువ రూ.3,500 కోట్లుగా ఉండగా, మైండ్ ట్రీ అమ్మకంతో రూ.2,600 కోట్లకు చేరుకుంది. ఈ తర్వాత షేర్ విలువ రూ.309కు చేరుకుంది. ఆ తర్వాత మాత్రం షేర్లు కుంగిపోయాయి. కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో తనఖాలోని సింహభాగం షేర్ల విలువ దిగజారిపోయింది. ఇప్పటికే ఉన్న అప్పులకు తోడు తనఖాలో ఉన్న షేర్లకు భద్రతగా మరిన్ని నిధులు, ఆస్తులను హామీగా చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మైండ్ ట్రీలో వాటాలు విక్రయించినా రుణాలు తీరలేదు. దీంతో సిద్ధార్థపై ఒత్తిడి పెరిగింది.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications