ఇండిగో బంపరాఫర్, రూ.999కే టిక్కెట్
ముంబై: ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఈ దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కంపెనీ పదమూడవ వార్షికోత్సవ సేల్ సందర్భంగా టిక్కెట్ల పైన భారీ డిస్కౌంట్ ఇస్తోంది. దేశీయ విమాన టిక్కెట్ల పైన రూ.999 నుంచి ప్రారంభమవుతోంది. విదేశీ ప్రయాణపు ధర టిక్కెట్ రూ.3,499 నుంచి ప్రారంభమవుతోంది.
ఆగస్ట్ 15, 2019 నుంచి మార్చి 31, 2019 మధ్య ప్రయాణించే 56 డొమెస్టిక్,19 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్‌కు మంచి ఆఫర్ ఇచ్చారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రూట్లలో మొత్తం దాదాపు 10 లక్షల సీట్ల వరకు ఆఫర్ ఇస్తున్నాయి.

ఇండిగో పదమూడేళ్లు పూర్తి చేసుకుందని, ఈ ప్రయాణానికి తోడ్పాటు అందించిన కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములకు ప్రత్యేక కృతజ్ఞతలు అని, ఈ ప్రత్యేక సందర్భంలో ధరల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించామని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియణ్ బౌల్టర్ తెలిపారు. ఈ టిక్కెట్లు నాన్ ట్రాన్సుఫరబుల్.. నాన్ ఎక్స్‌చేంజబుల్.. నాన్ ఎన్‌క్యాషబుల్. ఇండిగో గ్రూప్స్ బుకింగ్స్‌ల్లో ఈ ఆఫర్ చెల్లదని తెలిపింది.
ప్రయాణీకులకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా మినిమం రూ.4,000 ట్రాన్సాక్షన్ పైన రూ.1000 వరకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఉంది. యస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా చేసే రూ.10,000 ట్రాన్సాక్షన్ పైన రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్ ఉంది.


Click it and Unblock the Notifications