బెంగళూరు: వీజీ సిద్ధార్థ ఆత్మహత్య నేపథ్యంలో కేఫ్ కాఫీ డే తన కొత్త ఇంటర్మ్ చైర్మన్‌గా ఎస్వీ రంగనాథ్‌ను ఎన్నుకుంది. పూర్తిస్థాయి చైర్మన్ నియామం జరిగేవరకు ఈయన తాత్కాలిక చైర్మన్‌గా ఉంటారు. రంగనాథన్ ప్రస్తుతం కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే నితిన్ బాగ్‌మెన్‌ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపింది.
రంగానాథ్ 1975 కేడర్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పని చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. గతంలో అబుదాబిలోని ఇండియన్ ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్ బోర్డు డైరెక్టర్లలో ఒకరుగా ఉన్నారు. కాఫీడే ఎంటర్ ప్రైజెస్ తర్వాత సమావేశం ఆగస్ట్ 8వ తేదీన జరగనుంది.

కంపెనీని నిపుణుల సాయంతో నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తామని ప్రకటించింది. కేఫ్ కాఫీ డే షేర్లు రెండు రోజులుగా భారీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఇరవై శాతం పడిపోయిన షేర్లు, బుధవారం కూడా మోర ఇరవై శాతం పడిపోయి, రూ.122 నుంచి రూ.123 మధ్య ముగిశాయి. మొత్తంగా రెండ్రోజుల్లో 40 శాతం తగ్గాయి.
కాఫీ డే ఎంటర్ ప్రైజెస్‌లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవికా హెగ్డే ఉన్నారు. ఆమె 2008 నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్ ఆల్బర్ట్ హైరోనిమస్ స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదకొండేళ్ల నుంచి మైండ్ ట్రీ బోర్డులోనూ ఉన్నారు. సంజయ్ ఓంప్రకాష్ నాయర్ నాన్ ఎగ్జిక్యూటీవ్, నామినీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సులక్షణ రాఘవన్ కూడా ఉన్నారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications