ఈ కారణాలతో మీ బీమా ప్రీమియం పెరుగుతుంది.. అవేమిటంటే..
ఎంతో కొంత ఆదాయం సంపాదిస్తే చాలు తనతో పాటు తన కుటుంబానికి రక్షణను కల్పించే జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవాలన్న ఆలోచన చాలా మందిలో కలుగుతోంది. ఈ బీమాలను తీసుకు సమయంలో వెల్లడించే పలు అంశాలు ప్రీమియంను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా అలాంటి వాటికీ దూరంగా ఉంది బీమా ప్రీమియం భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అవేమిటో తెలుసుకుందాం..
* సాధారణంగా జీవిత బీమా కంపెనీలు వ్యక్తుల మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న అంశాన్ని ప్రధానంగా లెక్కలోకి తీసుకొని బీమా ప్రీమియంను నిర్ణయిస్తుంటాయి. ఆరోగ్య బీమా సంస్థలు అయితే బీమా తీసుకునే వ్యక్తికి ఉన్న అలవాట్లను లెక్కలోకి తీసుకొని బీమాను నిర్ణయిస్తాయి.
* వయసు, కుటుంబ చరిత్ర, ఇప్పటికే ఉన్న వ్యాధులు, జీవన శైలీ తదితర అంశాలను బట్టి బీమా ప్రీమియం ఆధార పడి ఉంటుంది.
* పొగ తాగడం, మద్యం సేవించడం, ఉద్యోగం, తల్లిదండ్రులు, సహోదరుల ఆరోగ్య చరిత్ర, ఇంటి చిరునామా వంటివి మరణాలను ప్రభావితం చేస్తుంటాయి.
* పొగ తాగడం వంటి అలవాటు ఉంటే కేన్సర్ వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది.

వయసు ప్రభావం ఎలాగుంటుందంటే..
* వయసును బట్టి బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వయసు ఉంటే ఎక్కువ ప్రీమియం, తక్కువ వయసు ఉంటే తక్కువ ప్రీమియం ఉంటుంది.
* ఇరవై ఏళ్ల వయసు, ముప్పై ఏళ్ల వయసుకు మధ్య ప్రీమియంలో తేడా 5 శాతం ఎక్కువగా ఉంటే 40 ఏళ్ల వయసు వచ్చేసరికి 30 శాతం, 50 ఏళ్ళ వయసులో 145 శాతం, 60 ఏళ్ల వయసులో ప్రీమియం 400 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది.
కుటుంబ చరిత్ర
* మీ కుటుంబంలోని వారు వ్యాధులతో బాధ పడుతూ ఉంటే వాటి ప్రభావం మీ బీమా ప్రీమియం పై పడుతుంది.
* కొన్ని వ్యాధులు జెనెటిక్ సంబంధితంగా ఉంటాయి. ఒకవేళ బీమా తీసుకునే సమయంలో మీ కుటుంబంలో ని వారికీ వ్యాధులు ఉన్నట్టు వెల్లడించకపోయినా ఒకవేళ హాస్పిటల్లో చేరినప్పుడు క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు తెలిసిపోతుంది. క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉండవచ్చు. అందుకే ప్రీమియం కోసం చూసుకోకుండా బీమా తీసుకునే టప్పుడే అన్ని విషయాలు తెలియజేయాలి.
మహిళలకు తక్కువ...
* పురుషులతో పోల్చితే మహిళలకు బీమా ప్రీమియం తక్కువ ఉంటుంది.
* మహిళల మరణాల రేటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
మరికొన్ని అంశాలు ..
* వ్యక్తులు చేసే ఉద్యోగాలను బట్టి బీమా ప్రీమియం పెరగడానికి అవకాశం ఉంటుంది.
* ప్రమాదకరమైన ప్రాంతాల్లో పనిచేసినా, కెమికల్స్ తదితరాల పరిశ్రమల్లో పనిచేసినా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికీ బీమా ప్రీమియం ఎక్కువ ఉంటుంది.


Click it and Unblock the Notifications