రిటైల్ ఇన్వెస్టర్లకు అలర్ట్: యూపీఐ ద్వారానే ఐపీఓల్లో పెట్టుబడి
న్యూఢిల్లీ: రిటైల్ పెట్టుబడిదారుల కోసం తొలి పబ్లిక్ ఇష్యూను UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ఆధారిత ASBA (అప్లికేషన్స్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) ఆప్షన్‌తో తీసుకు రావాలని నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. తద్వారా పబ్లిక్ ఇష్యూలకు అప్లికేషన్ దాఖలు చేసే పద్ధతిలో ఈ మార్పు చోటు చేసుకుంది.

యూపీఐ ఆధారిత ఏఎస్‌బీఏ ద్వారా
ఇక నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు UPI ఆధారిత ASBA (అస్బా) ద్వారానే పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వచ్చినట్లు NPCI స్పష్టం చేసింది. ప్రస్తుతం టీ ప్లస్ 6 పద్ధతిలో ఐపీవోలను ముగిస్తున్నారు. అంటే ఐపీవో ముగింపు తేదీ నుంచి ఆరు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలి.

మూడ్రోజుల్లోనే ముగింపు..
ఇప్పుడు యూపీఐ ఆధారిత చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చాక దీనిని మూడ్రోజుల్లోనే ముగించాలని భావిస్తున్నారు. యూపీఐ పద్ధతిలో ఐపీవో దరఖాస్తులు దాఖలు చేయడం వల్ల బ్యాంకుల వారీగా బిడ్ కమ్ అప్లికేషన్ దరఖాస్తులు విడదీసి సంబంధిత బ్యాంకులకు పంపవలసిన అవసరం ఏర్పడదు. దీంతో ప్రక్రియ తక్కువ సమయంలో పూర్తవుతుంది.

దశలవారీగా అమలు..
రెండో విడత యూపీఐ చెల్లింపుల విధానాన్ని జూలై 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చినట్లు NPCI తెలిపింది. నాటి నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా చెల్లింపులు చేపట్టే విధానాన్ని అమలు చేస్తూ వస్తోందని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి దశలవారీగా దీనిని అమలు చేస్తున్నామని తెలిపింది.

తక్షణ చెల్లింపు వ్యవస్థ
జూలై 29వ తేదీ నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు.. బ్రోకర్లు, డీపీలు, ఆర్‌టీఏల ద్వారా కొనుగోలు చేసే అన్ని రిటైల్ ఐపీవో ఇన్వెస్టర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. యూపీఐ తక్షణ చెల్లింపు వ్యవస్థ. మొబైల్ ఫోన్స్ ద్వారా రెండు బ్యాంకుల మధ్య వెంటనే నగదు ట్రాన్సుఫర్‌కు ఉపయోగపడుతుంది. యూపీఐ ద్వారా ఐపీవోకు చెల్లింపుల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు తక్షణ ఫండ్ ట్రాన్సుఫర్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారని NPCI సీవోవో ప్రవీణ్ రాయ్ తెలిపారు.ఐపీవోను పూర్తిగా డిజిటల్‌గా, పేపర్‌లెస్‌గా మార్చడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నామని 5పైసా డాట్ కామ్ సీఈవో ప్రకాశ్ గాగ్డానీ అన్నారు. ఐపీవోలను పూర్తిస్థాయి డిజిటల్, పేపర్‌లెస్‌గా మార్చేందుకు ఈ అడుగు ఉపయోగపడుతుందన్నారు. అలాగే, అబ్సా, యూపీఐ కారణంగా చిన్న, తొలిసారి ఇన్వెస్ట్ చేసే వారిని ప్రైమరీ మార్కెట్లో శక్తిమంతం చేస్తుందన్నారు.


Click it and Unblock the Notifications