స్టాక్ మార్కెట్ ఎక్కడా కోలుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. రోజుకో కొత్త కనిష్ట స్థాయిని చేరుతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నిఫ్టీ ఏకంగా ఆరు నెలల కనిష్టానికి జారుకుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 30 నెలల కనిష్టానికి దిగొచ్చింది. గతేడాది సెప్టెంబర్ తర్వాత మరో భారీ పతనాన్ని చవిచూశాయి మార్కెట్లు. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్‌తో పాటు రిలయన్స్ వంటి స్టాక్స్‌లో అమ్మకం నిఫ్టీని నేలచూపులు చూసేలా చేసింది. ఒక్క ఐటీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలూ కుప్పకూలాయి. చివరకు 290 పాయింట్ల నష్టంతో 37397 దగ్గర సెన్సెక్స్ స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు దిగొచ్చి 11085 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 505 పాయింట్లు పడి 28972 వద్ద ముగిసింది.
ఈ ఉదయం 11214 దగ్గర స్థిరంగానే ప్రారంభమైన నిఫ్టీ 50 పాయింట్ల వరకూ లాభపడింది. అయితే మిడ్ సెషన్ తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో నిఫ్టీ 11072 పాయింట్ల కనిష్టం వరకూ పడిపోయింది. ఆఖరి వరకూ ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు రెండూ మూడు శాతం వరకూ క్షీణించాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5 శాతం పడిపోవడం ఆందోళనను పెంచింది. ఆ తర్వాత జాబితాలో మెటల్, మీడియా, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్స్, ఆటో స్టాక్స్ చేరాయి. భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్ సి ఎల్ టెక్, విప్రో, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హీరోమోటోకార్ప్, సన్ ఫార్మా స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

ఆర్‌బిఎల్ బ్యాంక్.. డీలా
ప్రధాన ప్రైవేట్ బ్యాంక్ ఆర్.బి.ఎల్. బ్యాంక్ వరుస పతనాలతో బెంబేలెత్తిస్తోంది. త్రైమాసిక ఫలితాల అనంతరం మరింత నీరసించిన బ్యాంక్ ఈ రోజు కూడా ఏకంగా 12 శాతం దిగొచ్చింది. అతి తక్కువ కాలంలో సుమారు 40 శాతం వరకూ స్టాక్ పతనం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చివరకు స్టాక్ రూ.398.20 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా 7 శాతం పతనమై రూ.1330 దగ్గర స్థిరపడింది.
రిలయన్స్.. ఆరో రోజూ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిసింది. రెండు నెలల్లో ఈ స్థాయిలో వరుస పతనాలు మళ్లీ ఇప్పుడే కనిపిస్తున్నాయి. రిజల్ట్స్ నుంచి ఈ స్టాక్ కూడా కిందికి దిగి వస్తోంది. చివరకు స్టాక్ 2.5 శాతం నష్టంతో రూ.1180 దగ్గర క్లోజైంది.
ఇండియాబుల్... గుబుల్..
సుబ్రమణియన్ స్వామి లేఖ తర్వాత ఇండియాబుల్స్ గ్రూప్ స్టాక్స్‌లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఇప్పటికిప్పుడు ఈ గ్రూపుపై ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బంది లేనప్పటికీ స్టాక్ మాత్రం నీరసిస్తోంది. ఈ రోజు కూడా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 7 శాతం నష్టంతో రూ.523 దగ్గర క్లోజైంది. ఇదే గ్రూపనకు చెందిన ఐబీ రియల్ ఎస్టేట్ 15 శాతం, ఐబీ వెంచర్స్ 10 శాతం దిగొచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొండిబకాయిల దెబ్బ
తన త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన పటిష్టతను చూపిన బ్యాంక్.. మొండి బకాయిల విషయంలో మాత్రం నీరసించింది. నికర లాభం 155 శాతం, నికర వడ్డీ ఆదాయంలో 4 శాతం వృద్ధిని సంస్థ నమోదు చేసింది. అయితే మొండిబకాయిలు 5.61 నుంచి 5.79 శాతానికి పెరిగాయి. ఈ నేపధ్యంలో స్టాక్ 6.5 శాతం రూ.70.70 దగ్గర స్థిరపడింది.
హీరో మోటో... మరీ దారుణం
ప్రముఖ టూవీలర్ సంస్థ హీరోమోటో పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్టాక్ నిత్యం 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఈ రోజు కూడా 6 శాతానికి పైగా నష్టంతో స్టాక్ క్లోజైంది. మార్కెట్ సమయం తర్వాత ఫలితాలను ఈ కంపెనీ వెల్లడించాల్సి ఉంది. చివరకు స్టాక్ 6.06 శాతం నష్టంతో రూ.2259 దగ్గర క్లోజైంది.
డాక్టర్ రెడ్డీస్ అంతంతే..
త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన కంపెనీ రెవెన్యూలో 3 శాతం, నికర లాభంలో 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్జిన్లు కొద్దిగా క్షీణించాయి. దీంతో స్టాక్ 3.5 శాతం నష్టంతో రూ.2562 దగ్గర క్లోజైంది.
కాఫీడేకు విజి సిద్ధార్థ దెబ్బ
సంస్థ ప్రమోటర్ విజి సిద్ధార్థ నిన్న రాత్రి నుంచి అనుమానాస్పద రీతితో కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం రాసిన లేఖలో ఆయన.. ఆవేదనను బోర్డుకు నివేదించారు. ఒత్తిళ్లను ఇక తట్టుకునే శక్తి లేక.. అన్నీ త్యజిస్తున్నాను అనేది లేఖ సారాంశం. దీంతో ఆయన ఏమైనా ఆఘాయిత్యానికి పాల్పడ్డారా అనే కోణం కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కాఫీ డే స్టాక్ 20 శాతం నష్టంతో రూ.154 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications