బెంగళూరు: కాఫీ డే గ్రూప్ ఫౌండర్ వీజీ సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించడం లేదు. అతను గత రాత్రి తన ఇన్నోవా కారులో రాత్రిపూట మంగళూరువైపు ప్రయాణించారు. మధ్యలో ఉన్న ఉల్లాల్ బ్రిడ్జి వద్ద ఆగారు. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయారు. అతను ఎందుకు అదృశ్యమయ్యాడు, ఏం జరిగిందనే అంశం ఎవరికీ తెలియ రాలేదు.

ఎలా అదృశ్యమయ్యాడంటే...
ఇన్నోవా కారులో గత రాత్రి పూట డ్రైవర్‌తో కలిసి వీజీ సిద్ధార్థ ప్రయాణించారు. నేత్రావతి పైన ఉన్న ఉల్లాల్ బ్రిడ్జి దాటే సమయంలో.. కారును ఆపమని తన డ్రైవర్‌కు చెప్పాడు. డ్రైవర్ ఆపిన వెంటనే కారు దిగారు. కారును అలాగే వెళ్లనీయమని డ్రైవర్‌కు సూచించాడు. డ్రైవర్ కారును నెమ్మదిగా ముందుకు పోనిచ్చాడు. అదే సమయంలో వీజీ సిద్ధార్థ కారు వెనుక కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చారు. కాసేపటి తర్వాత కనిపించలేదు. దీంతో డ్రైవర్ వీజీ సిద్ధార్థకు ఫోన్ చేశారు. అది స్విచ్చాఫ్ చేసి ఉంది.

నదిలో పడిపోయారా?
వీజీ సిద్ధార్థ ఎలా మాయమయ్యారు, ఎందుకు మాయమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విషయం తెలియగానే పోలీస్, రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి, నేత్రావతి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. అతను నదిలోకి దూకవచ్చు లేదా ప్రమాదవశాత్తూ పడిపోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారం మాత్రం సాగుతోంది.

బ్రిడ్జి మధ్యలో ఆగిపోయిన డాగ్ స్వ్కాడ్
నిన్న వీజీ సిద్ధార్థ బెంగళూరు నుంచి సక్లేష్‌పూర్‌కు వెళ్తున్నారని, కానీ ఆ తర్వాత మంగళూరుకు వెళ్లాలని డ్రైవర్‌కు చెప్పాడని బెంగళూరు పోలీసులు అన్నారు. నేత్రావతి నది పైన ఉన్న బ్రిడ్జి వద్దకు చేరుకున్న అనంతరం కారును ఆపి, అతను దిగిపోయాడని, డ్రైవర్‌కు మాత్రం ముందుకు వెళ్లమని చెప్పాడని తెలిపారు. కానీ అతను మిస్ అయ్యాడని చెప్పారు. తాము డాగ్ స్క్వాడ్‌ను తీసుకు వస్తే బ్రిడ్జి మధ్యలోకి వెళ్లి ఆగిపోయిందని చెప్పారు. దీంతో నదిలో పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. పడవలు, గజ ఈతగాళ్లు, స్థానిక చేపల వేటవారి ద్వారా గాలిస్తున్నట్లు తెలిపారు. వీజీ సిద్ధార్థతో చివరిసారి ఎవరు మాట్లాడారో తెలుసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. అతనికి ఎవరెవరు ఫోన్లు చేశారో కనుక్కొని మాట్లాడుతున్నట్లు తెలిపారు.

ఎస్ఎం కృష్ణ అల్లుడు
మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ. ఎస్ఎం కృష్ణ కుమార్తె మాళవికను సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. దేశంలో అతిపెద్ద కేఫ్ డే సంస్థతో పాటు హోటల్ బిజినెస్ ఉంది. 1996లో తొలిసారి బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్డులో కాఫీ డేను ఏర్పాటు చేశారు. మంగళూరు యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పుచ్చుకున్నారు. స్టాక్ మార్కెట్ వ్యాపారం నిర్వహించారు. ఆ తర్వాత కాఫీ వ్యాపారంలోకి ప్రవేశించి, 1993లో పూర్తిస్థాయి బిజినెస్ చేశారు.

కోకాకోలాతో చర్చలు
తక్కువ కాలంలో మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. 1996లో కేఫ్ కాఫీ డేను ప్రారంభించారు. 1760కు పైగా బ్రాంచీలు ఉన్నాయి. 60,000 వెండింగ్ మిషన్లు ఉన్నాయి. వియన్నా, జెస్ రిపబ్లిక్, మలేషియా, నేపాల్, ఈజిప్ట్‌లలోను స్టోర్స్ ఉన్నాయి. 15,000 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ ఎస్టేట్ ఉంది. కాఫీ రిటైల్ వ్యాపారంలో కోకాకోలా వంటి మల్టీ నేషనల్ కంపెనీకి వాటా ఇచ్చే అంశంపై వీజీ సిద్ధార్థ ఇటీవలే ఆ కంపెనీతో చర్చలు జరిపారు. 2020 మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి కాఫీ రిటైల్ వ్యాపారం సుమారు రూ.2,250 కోట్లుగా ఉంటుందని అంచనా.

మైండ్ ట్రీలోని వాటా విక్రయం
కాగా, బెంగళూరుకు చెందిన ఐటీ సర్వీసెస్ కంపెనీ మైండ్ ట్రీలోని తన 20.4 శాతం వాటాను వీజీ సిద్ధార్థ విక్రయించారు. ఈ వాటాలను ఆయన ఎల్ అండ్ టీకి షేరుకు రూ.980 చొప్పున విక్రయించారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications