ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలపరిమితులపై వీటిని తగ్గించింది. 45 రోజుల కాల వ్యవధి నుంచి పదేళ్ల కాల పరిమితిపై ఈ నిర్ణయం తీసుకుంది. జూలై నెలలో వివిధ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. తాజాగా, ఎస్బీఐ తగ్గించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. మిగులు ద్రవ్యం, తగ్గుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో దీనిని కూడా తగ్గించినట్లు పేర్కొంది.

డిపాజిట్స్‌పై ఇలా బేసిస్ పాయింట్స్ తగ్గించింది
తక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు, ఎక్కువ కాలపరిమితి కలిగిన వాటిపై 20 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. రూ.2 కోట్లు ఆపై బల్క్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఎస్బీఐ మే నెల 9వ తేదీన సెలెక్టివ్ మెచ్యూరిటీస్ పైన వడ్డీ రేటును సవరించింది.

ఏ కాలపరిమితికి ఎంత తగ్గించిందంటే?
7 రోజుల నుంచి 45 రోజుల FD మెట్యూరింగ్ డిపాజిట్స్ పైన 5.75 శాతం ఉన్న వడ్డీ రేటును 5 శాతానికి తగ్గించింది. 46 రోజుల నుంచి 179 రోజుల వరకు డిపాజిట్స్ పైన 5.75 శాతానికి, 180 నుంచి 210 రోజుల వరకు డిపాజిట్స్ పైన 6.25 శాతానికి, 211 రోజుల నుంచి ఏడాది డిపాజిట్స్‌పై 6.25 శాతానికి తగ్గించింది.

సంవత్సరానికి పైగా ఉంటే...
ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల కాలపరిమితిపై 6.80 శాతానికి, రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితిపై 5 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఇది 6.70 శాతంగా ఉంటుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితిపై ఇప్పటి వరకు 6.70 శాతం ఉండగా, ఇప్పుడు 6.60 శాతానికి తగ్గించింది. అయిదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితి డిపాజిట్స్ పైన 6.60 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించింది.చివరిసారిగా ఈ ఏడాది మే నెలలో ఎస్‌బీఐ వడ్డీరేట్లను సవరించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications