For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విదేశీ ఇన్వెస్టర్లు పరుగో పరుగు! 2 నెలల కనిష్టానికి నిఫ్టీ

|

స్టాక్ మార్కెట్ వరుస పతనాలతో బెంబేలెత్తిపోతోంది. విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు పాల్పడడంతో మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. కీలకమైన అనేక స్థాయిలను దాటిమరీ వెనక్కి దిగివస్తోంది. బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా దన్నుగా నిలిచినప్పటికీ మెటల్స్, ఆటో రంగ షేర్లలో అమ్మకాలు.. పరిస్థితిని మరింత నీరసింపజేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ మన సూచీలు మాత్రం పతనమే పరమావధిగా పెట్టుకున్నాయి. ఒక్క ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. చివరకు నిఫ్టీ 95 పాయింట్లు కోల్పోయి 11,190 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 196 పాయింట్లు దిగొచ్చి 37687 దగ్గర స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే కాస్త ఫర్వలేదనిపించింది. చివరకు 30 పాయింట్లు తగ్గి 29296 దగ్గర ఆగింది.

ముఖ్యంగా ఆటో, మీడియా, మెటల్ రంగ షేర్లు మూడు శాతానికి పైగా కోల్పోవడం ఆందోళన పెంచింది. వీటితో పాటు ఫార్మా, రియాల్టీ, ఎఫ్ఎంసిజి సంస్థల స్టాక్స్‌ కూడా నష్టపోయాయి. ఇక మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఒకటిన్నర శాతం వరకూ దిగొచ్చాయి.

 Nifty ends below 11,200, Sensex down 196 points

ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్ సి ఎల్ టెక్, టిసిఎస్, ఇన్ఫోసిస్ స్టాక్స్ టాపై ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, గ్రాసిం, టాటా మోటార్స్, వేదాంతా, ఇన్ఫ్రాటెల్ స్టాక్స్ నష్టపోయిన షేర్ల జాబితాలో చేరాయి.

ఇండియాబుల్స్‌కు సుబ్రమణియన్ షాక్
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి రూ. లక్ష కోట్ల వరకూ రుణం తీసుకుందని, ఇప్పుడు ఈ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మునిగిపోయే స్థితికి వచ్చిందంటూ.. బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రమణియన్ స్వామి.. ఏకంగా ప్రధాన మంత్రికి లేఖ రాశారు. దీంతో ఈ గ్రూపుపై మరో సారి ఆందోళన రేగింది. ఈ గ్రూపు స్టాక్స్ 6 నుంచి 10 శాతం వరకూ నష్టపోయాయి. ఎన్.హెచ్.బి. నుంచి తాము అసలు రుణాలే తీసుకోలేదని, తమ గ్రూప్ మొత్తం అప్పులు రూ.87 వేల కోట్లే ఉన్నాయంటూ ఐండియాబుల్స్ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. అయినప్పటికీ స్టాక్స్‌లో మాత్రం నష్టాలు ఆగలేదు. చివరకు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 12 శాతం నష్టపోయి రూ.549 దగ్గర క్లోజైంది. ఐబీ హౌసింగ్ 7 శాతం నష్టపోయి రూ.99 దగ్గర, ఐబీవెంచర్స్ 5.5 శాతం తగ్గి రూ.256 దగ్గర ముగిశాయి.

ఐడియా.. వాట్స్ హ్యాపెనింగ్ సర్‌..జీ..
వోడా-ఐడియా స్టాక్ ఏకంగా 27 శాతం కోల్పోయింది. సంస్థ మొన్న ప్రకటించిన ఫలితాల్లో ఏకంగా రూ.4875 కోట్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది. దీనికి తోడు గత రెండు క్వార్టర్లలో సుమారు 7 కోట్ల మంది కస్టమర్లు కూడా వీళ్ల నుంచి జారిపోయారు. ఇప్పటికే అప్పు కూడా రూ.1 లక్ష కోట్ల మార్కును దాటిపోయింది. ఇలా అనేక కారణాలతో స్టాక్ ఈ రోజు కూడా 30 శాతం వరకూ నీరసించింది. చివరకు స్టాక్ రూ.6.75 దగ్గర క్లోజైంది.

నెరోలాక్ మెరుగైన రిజల్ట్స్
ప్రముఖ పెయింట్ తయారీ సంస్థ నెరోలాక్ పెయింట్స్ స్థిరమైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆదాయంలో 9 శాతం, నికర లాభంలో 5 శాతం, ఎబిటాలో 14 శాతం వృద్ధి నమోదైంది. మార్జిన్లు కూడా 15.8 నుంచి 16.5 శాతానికి ఎగబాకింది. ప్రధానంగా డెకొరేటివ్ సెగ్మెంట్.. రండంకెల వృద్ధిని సాధించడం కలిసొచ్చింది. ఈ నేపధ్యంలో స్టాక్ 8 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ.432 దగ్గర క్లోజైంది.

ఐసిఐసిఐ బ్యాంక్‌కు రిజల్ట్స్ బూస్ట్
మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన నేపధ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ఎగిరి గంతేసింది. ఒంటి చేత్తో మార్కెట్లను కూడా కొద్దోగొప్పో నిలబెట్టింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం పెరిగి రూ.7737 కోట్లకు చేరింది. మొండి బకాయిల భారం కూడా కాస్త తగ్గి కుదుపడ్తున్న పరిస్థితి. గతంతో రూ.120 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన బ్యాంక్ ఇప్పుడు రూ.1908 కోట్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్‌ను వెల్లడించింది. వీటన్నింటి నేపధ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ 3.4 శాతం పెరిగి రూ.429 దగ్గర క్లోజైంది.

రెండేళ్ల కనిష్టానికి మారుతి సుజుకి
కొత్త కార్లు, బైక్‌ల రిజిస్ట్రేషన్ ఫీజులను కేంద్రం పెంచే యోచనలో ఉందనే వార్తల నేపధ్యంలో ఆటో కంపెనీలకు మరో దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే డిమాండ్ తగ్గి సమస్యల్లో ఉన్న కంపెనీలకు ఈ కొత్త షాక్ తగలడంతో ఆటో స్టాక్స్ అన్నీ కనిష్ట స్థాయిలకు దిగొస్తున్నాయి. మారుతి సుజుకి రెండేళ్ల కనిష్టానికి దిగొచ్చి రూ.5558 స్థాయిలకు చేరింది. ఈ రోజు కూడా మరో 5 శాతం పతనమైంది.

ఇదే బాటలో టాటా మోటార్స్ 6.5 శాతం, టీవీస్ మోటార్స్ 5 శాతం, బజాజ్ ఆటో - ఐషర్ మోటార్స్ 4.5 శాతం నష్టపోయాయి. అశోక్ లేల్యాండ్ కూడా 3.5 శాతం దిగొచ్చి రూ.71.55 దగ్గర స్థిరపడింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని తగ్గించిన నేపధ్యంలో ఇదే రంగంలో ఉన్న గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ స్టాక్ మాత్రం 5.5 శాతం పెరిగి రూ.198 దగ్గర క్లోజైంది.

English summary

విదేశీ ఇన్వెస్టర్లు పరుగో పరుగు! 2 నెలల కనిష్టానికి నిఫ్టీ | Nifty ends below 11,200, Sensex down 196 points

Sensex, Nifty End At Two-Month Low As Foreign Investors Continue Selling. Indian equity benchmarks ended lower after a one-day breather on Friday as foreign investors continued to sell. The S&P BSE Sensex ended 0.52 percent lower at 37,686.37 and the NSE Nifty 50 ended at 11,189.20, down 0.84 percent. The broader market represented by the NSE Nifty 500 Index ended 0.91 percent lower.
Story first published: Monday, July 29, 2019, 18:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X