హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం తెలుగు సినిమా హీరోల్లో అత్యధిక ఎండోర్స్ ప్రిన్స్‌వే. సతీమణి నమ్రతా శిరోద్కర్ మార్కెట్ రంగంలో దిట్ట. దీంతో పెళ్లి అనంతరం ఆర్థిక వ్యవహారాలు అన్నీ ఆమె చూసుకుంటున్నారు. ఇప్పటికే పలు బ్రాండ్లతో మహేష్ బాబు టైఅప్ అయ్యారు. సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఏఎంబీ సినిమా్ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్ ప్రారంభించారు. ఇప్పుడు మరో వ్యాపారంలోకి అడుగిడుతున్నారు.
ఈ-కామర్స్ వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉత్పత్తులు
మహేష్ బాబు తన బ్రాండ్ ఇమేజ్‌ను సద్వినియోగం చేసుకుంటూ సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నారు. ప్రముఖ ఈ-కామర్స్ బిజినెస్ కంపెనీతో కలిసి దీనిని తీసుకు వస్తున్నారు. ఈ-కామర్స్ పోర్టల్ Spoyl ద్వారా తన ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఎవరైనా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

ఫ్యాన్స్‌కు ఆఫర్, కౌంట్ డౌన్ ప్రారంభం
అదే సమయంలో ఈ బ్రాండ్ వినియోగదారులకు ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. మహేష్ బాబును కలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ అవకాశం అందరికీ కాదు. ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన వారిలో కొందరు లక్కీ విన్నర్స్‌కు తమ అభిమాన హీరోను కలుసుకునే అవకాశం ఉంది. https://www.spoyl.in/thehumblco
దీనిని ఆగస్ట్ 7వ తేదీన లాంచ్ చేస్తున్నారు. పైన లింక్‌లోకి వెళ్తే ఆగస్ట్ 7వ వరకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.

ది హంబుల్ కో
మహేష్ బాబు ది హంబుల్ కో పేరుతో వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం తన ట్వీట్టర్ ద్వారా ధృవీకరించారు. ది హంబుల్ కో కేవలం దుస్తులే కాదు.. జీవన విధానం అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేష్ బాబు ఇప్పుడు సొంతగా ఓ బ్రాండ్‌ను ప్రారంభించి వస్త్ర వ్యాపారంలోకి దిగడారు.

సమంత కూడా..
ఇప్పటికే విజయ దేవరకొండ రౌడీ పేరుతో సొంత బ్రాండ్ ప్రారంభించారు. బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, వంటి వారు కూడా ఈ బిజినెస్‌లో ఉన్నారు. మహేష్ బాబుతో పాటు నటి సమంత కూడా తన ఓన్ బ్రాండ్‌ను ఇదే ఈ-కామర్స్ వెబ్ సైట్ ద్వారా లాంచ్ చేస్తోంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications