మ్యూచువల్ ఫండ్ సంస్థలు సరికొత్తగా మరిన్ని ఫండ్స్ ను తీసుకువచ్చాయి. వీటి లక్ష్యాలను పరిశీలించి పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు.

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్
* యాక్సిస్ మనీ మార్కెట్ ఫండ్ పేరుతో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.
* మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రెగ్యులర్ ఆదాయాన్ని రాబట్టాలన్నది ఈ ఫండ్ ఉద్దేశం.
* డేట్ స్కీం - మనీ మార్కెట్ ఫండ్ కేటగిరీలో తెచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
* ఈ ఫండ్ ఈ నెల 26న ప్రారంభమైంది. ఆగస్టు 1న ఫండ్ ముగుస్తుంది.
* ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్ లేదు.
* ఇందులో కనీస పెట్టుబడి రూ. 5,000
* మరింత సమాచారాన్ని www.axismf.com ద్వారా తెలుసుకోవచ్చు.

ఐటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
* ఐటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ పేరుతో ఈ ఫండు ను తెచ్చారు.
* ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో క్యాపిటల్ ను పెంచాలన్నది ఈ పథకం ఉద్దేశం.
* ఈక్విటీ స్కీం - ఈఎల్ ఎస్ ఎస్ కేటగిరిలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
* ఈ నెల 15న ప్రారంభమైన ఈ పథకం అక్టోబర్ 14న ముగుస్తుంది.
* ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్ లేదు
* ఈ ఫండ్ లో కనీస పెట్టుబడి రూ. 500
* ఈ ఫండ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను www.itimf.com ద్వారా తెలుసుకోవచ్చు.

యూనియన్ మ్యూచువల్ ఫండ్
* యూనియన్ ఫోకస్డ్ ఫండ్ పేరుతో ఈ స్కీం అందుబాటులోకి వచ్చింది.
* ఎంపిక చేసిన ఈక్విటీ, ఈక్విటీ లింక్డ్ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మూలధనాన్ని పెంచాలన్నది ఈ స్కీం ఉద్దేశం.
* ఈక్విటీ స్కీం - ఫోకస్డ్ ఫండ్ కేటగిరీలో తెచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
* నెల 15న ప్రారంభమైన ఈ ఫండ్ 29న ముగుస్తుంది.
* ఎంట్రీ లోడ్ లేదు. ఏడాదికన్నా ముందుగా యూనిట్లను రిడీమ్ చేసినట్టయితే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ వసూలు చేస్తారు.
* ఇందులో కనీస పెట్టుబడి రూ. 5,000
* మరింత సమాచారం www.unionmf.com వెబ్ సైట్ లోకి లాగ్ ఇన్ అయి తెలుసుకోవచ్చు.

ఎస్ బీ ఐ మ్యూచువల్ ఫండ్
* ఎస్ బీ ఐ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ (ఎఫ్ ఎం పీ ) - సిరీస్ 14 (1102 రోజులు) పేరుతో ఈ ఫండ్ ను తెచ్చారు.
* ప్రభుత్వ సెక్యూరిటీలు, పీఎస్ యు అండ్ కార్పొరేట్ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టనున్నారు.
* ఆదాయం కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
* ఈ నెల 23న ప్రారంభమైన ఈ స్కీం 29న ముగుస్తుంది.
* ఇందులో కనీస పెట్టుబడి రూ. 5,000
* www.sbimf.com ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications