న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. రెండు రోజుల క్రితం జీఎస్టీ కౌన్సెల్ భేటీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అవశ్యమని, అలాగే, దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తక్కువ ఇంధనం అవసరమని, ఇది కేవలం కాలుష్యాన్ని నివారించడమే కాకుండా, చమురు దిగుమతులు తగ్గించడం ద్వారా విదేశీ కరెన్సీని కాపాడుతుందని యూపీ రవాణా శాఖమంత్రి స్వతంత్రదేవ్ సింగ్ వ్యాఖ్యానించారు కూడా.

భవిష్యత్తు EVలదే
విపరీతంగా పెరుగుతున్న కాలుష్యంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం EVలను ప్రోత్సహిస్తోంది. డీజిల్, పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత వాహనాలను వినియోగిస్తే కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. ఇప్పటికే చాలామంది విద్యుత్ వాహనాలు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తు అంతా EVలదే. కాలుష్యం నివారణకు EVల అవసరాన్ని దానికి తోడు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించడం గమనార్హం.

ఇలా భారం తగ్గుతుంది...
టెస్లా వంటి అంతర్జాతీయ కంపెనీలు మొదలు భారతీయ కంపెనీలు కూడా EVల తయారీపై దృష్టి సారించాయి. టాటా మోటార్స్ ఇప్పటికే అల్ట్రా ఈవీ పేరుతో విద్యుత్ బస్సును తయారు చేసింది. డీజిల్‌తో ఓ బస్సు ప్రయాణం చేయాలంటే ఎంత ఖర్చవుతుందో అందులో మూడో వంతు మాత్రమే విద్యుత్ బస్సుకు ఖర్చవుతుంది. అంటే దాదాపు మూడంట రెండింతల వరకు ఆదా అవుతుంది. EV బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ఉపయోగిస్తే ప్రయాణీకులు, వాహనదారులపై భారం తగ్గుతుంది.

ప్రభుత్వం రాయితీలు..
విద్యుత్ వాహనాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తోంది. విద్యుత్ వాహనాల తయారీపై కంపెనీలు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఉద్యోగాల కల్పనకు కూడా ఉపయోగపడనున్నాయి. పైగా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. మెట్రో నగరాల్లోను ప్రజా రవాణా కోసం విద్యుత్ బస్సుల్ని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. విద్యుత్ వాహనాల వాడకం వల్ల భారీగా ఇంధనం ఖర్చు తగ్గించవచ్చు. ఎలక్ట్రానిక్ వాహనాల ద్వారా వచ్చే శబ్ద కాలుష్యం కూడా తక్కువే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications