బెంగళూరు: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆఫ్‌లైన్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. బెంగళూరులో తొలి ఫర్నీచర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆదివారం నాడు తెలిపింది. 1800 చ.అ. విస్తీర్ణంలో దీనిని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ మార్కెట్‌లో కస్టమర్లకు ఆయా సామాగ్రి ఎలా ఉందో అనుభవపూర్వకంగా పరిశీలించే వీలు ఉండదని, ఆ టచ్ అండ్ ఫీల్ అనుభూతి కల్పించాలనే ఉద్దేశ్యంతో తొలి ఆఫ్‌లైన్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫర్నీష్యూర్
ఫ్లిప్‌కార్ట్ ప్రకారం... ఫర్నీచర్‌లోని అనేక రకాలను అర్థం చేసుకోవడం, ఇబ్బందులు లేకుండా వాటిని కొనుగోలు చేయడం, ఇన్‌స్టాలేషన్ అనుభవం కస్టమర్లకు అందించడమే ఈ ఆఫ్‌లైన్ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యం. కస్టమర్లను దృష్టిలో పని చేసే సంస్థ ఫ్లిప్‌కార్ట్ అని, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 'ఫర్నీష్యూర్' (FurniSure) ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ (ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రవైట్ లేబుల్) ఆదర్శ్ మీనన్ అన్నారు.

గూగుల్ లెన్స్‌తో అనుసంధానం
గూగుల్ లెన్స్‌తో దీనిని అనుసంధానం చేశారు. దీని వల్ల కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్‌తో ఫర్నీచర్ కేటలాగ్‌ను స్కాన్ చేయగానే, ఫ్లిప్‌కార్టులోని పేజీకి వెళ్తుందని, అక్కడ ఫీచర్లు తెలుసుకోవచ్చునని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఫర్నీచర్ మరో రెండు ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వీటిని కూడా బెంగళూరులోనే ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత ఇతర మెట్రో నగరాలకు విస్తరించనుంది.

విస్తరిస్తున్న ఐకియా
ఆన్‌లైన్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న కేటగిరీల్లో ఫర్నీచర్ ఒకటి. మెట్రో నగరాలతో పాటు టైర్ 1, టైర్ 3 టౌన్ల నుంచి మంచి డిమాండ్ ఉంది. భారత్‌లో ఆన్‌లైన్ మార్కెట్ 17 బిలియన్ డాలర్లకు విస్తరించింది. స్వీడన్ ఫర్నీచర్ రిటైలర్ ఐకియా భారత్‌లో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ సరికొత్త అడుగు వేసింది. ప్రముఖ ఫర్నీచర్ ఈ-కామర్స్ దిగ్గజాలు పెప్పర్‌ఫ్రై, అర్బన్ లాడర్, లైవ్‌స్పేస్ వంటివి కూడా గత కొన్నేళ్లుగా ఆఫ్‌లైన్ పైన దృష్టి సారించాయి.

ఫర్నీచర్ దిగ్గజాలదీ ఆఫ్‌లైన్ బాట
100 ఆఫ్‌లైన్ స్టోర్స్ ప్రారంభించేందుకు 12 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు పెప్పర్‌ఫ్రై ఈ ఏడాది ప్రారంభంలో వెల్లడించింది. ప్రస్తుతం 42 షాప్స్‌ను కలిగి ఉంది. అర్బన్ లాడర్ కూడా గత ఏడాది.. ఏడాదిన్నరలో ఆరు వరకు భారీ ఫార్మాట్ స్టోర్స్‌ను ప్రారంభించింది. మరిన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications