For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

$500 మిలియన్ సమీకరించనున్న ఉడాన్, $2bn దాటనున్న స్టార్టప్ వాల్యుయేషన్

|

చిన్న, మధ్యతరహా సంస్థలకు హోల్సేల్ ఉత్పత్తులను విక్రయించే మార్కెట్ ప్లేస్ ను నిర్వహిస్తున్న స్టార్టప్ కంపెనీ ఉడాన్ .... త్వరలో 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ 3,500 కోట్లు) సమీకరించనుంది. దీంతో ఈ స్టార్టుప్ కంపెనీ వాల్యుయేషన్ ఏకంగా రెండు రేట్లు పెరిగి 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ 15,400 కోట్లు) కు చేరనుంది. ప్రస్తుతం కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు లైట్ స్పీడ్ వెంచర్ పార్టనర్స్, యూరి మిల్నెర్స్ కు చెందిన డీఎస్టీ గ్లోబల్ పెట్టుబడి పెట్టె వరుసలో ముందు ఉండగా ... హిల్ హౌస్ కాపిటల్, అల్టిమేటర్ కాపిటల్ వంటి కొత్త కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో వెల్లడించింది. చైనా కు చెందిన టెన్సెంట్ కూడా ఈ మేరకు ఉడాన్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.

పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందు ఈ పనులు చేయండి...పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందు ఈ పనులు చేయండి...

ఫ్లిప్కార్ట్ మాజీ ఉద్యోగుల కంపెనీ...

ఫ్లిప్కార్ట్ మాజీ ఉద్యోగుల కంపెనీ...

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఉన్నతోద్యోగులు ఐన వైభవ్ గుప్త, ఆమోద మాల్వియా, సుజీత్ కుమార్ కలిసి ఉడాన్ ను స్థాపించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీకి 2016 లోనే తన పెట్టుబడులతో లైట్ స్పీడ్ వెంచర్ పార్టనర్స్ వెన్ను దన్నుగా ఉంది. అమెరికా లోని కాలిఫోర్నియా కేంద్రంగా లైట్ స్పీడ్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మరి కొన్ని వారాల్లోనే ఈ డీల్ పూర్తి కానుందని సమాచారం. ఇంత త్వరగా రెండు బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ సాధించటం ఉడాన్ కె చెల్లిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

హోల్సేల్ మార్కెట్ ప్లేస్ ...

హోల్సేల్ మార్కెట్ ప్లేస్ ...

బిజినెస్త 2 బిజినెస్ ఫార్మటు లో తయారీదారుల తో టై అప్ కుదుర్చుకొని, రిటైలర్స్, ఓ మోస్తరు హోల్ సేల్ వ్యాపారులకు బల్క్ గా ఉత్పత్తులను విక్రయించటం దీని ప్రత్యేకత. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ విధానంలో ఈ ప్రక్రియ సాగుతుంది. వినియోగ వస్తువులు, స్టేపుల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫార్మసీ, దుస్తులను తన మార్కెట్ ప్లేస్ లో విక్రయిస్తుంది. అంటే కాకుండా మర్చంట్ లకు లాజిస్టిక్స్ సేవలు, మార్కెటింగ్ సేవలు, అమ్మకాలు, డిస్ట్రిబ్యూషన్, సాఫ్ట్ వేర్ సేవలను సైతం అందిస్తోంది.

మర్చంట్ లకు రుణాలు కూడా...

మర్చంట్ లకు రుణాలు కూడా...

ఈ మధ్యే నాన్ బ్యాంకింగ్ లైసెన్స్ సంపాదించినా ఉడాన్ ... మర్చంట్ లకు రుణాలను కూడా అందిస్తోంది. దీంతో కంపెనీ వినియోగదారుల సంఖ్యా పెరుగుతోంది. అయితే, అత్యంత వేగంగా కార్యకలాపాలను విస్తరిస్తున్న ఈ కంపెనీ... 15 మిలియన్ డాలర్ల మేరకు నష్టాలను చవిచూస్తోంది. ప్రతి నెల ఇంత మొత్తం బర్నింగ్ రేటు ఉంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు నింజా కార్ట్ , జంబో టైల్ వంటి బిజినెస్ 2 బిజినెస్ కంపెనీలు ఒకే వర్టికల్ పై డ్రస్ట్రీ సరిస్తుండగా... ఉడాన్ మాత్రం అందుకు భిన్నంగా అనేక విభాగాలను ఏక కాలంలో నిర్వహిస్తోంది.

ఆదాయం రూ 6.5 కోట్లు ...

ఆదాయం రూ 6.5 కోట్లు ...

హోల్ సేల్ వ్యాపారం లో ఉండటంతో ఉడాన్ ... గ్రాస్ మెర్చండిసె వేల్యూ (GMV) అధికంగానే ఉంటోంది. ప్రస్తుతం ఈ కామపీనీ జీఎంవీ ఒక బిలియన్ డాలర్లు దాటిందట. కానీ ఆదాయం మాత్రం 2017-18 ఏడాది లో రూ 6.5 కోట్లుగా ఉన్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. హోల్ సేల్ బిజినెస్ లో మార్జిన్లు తక్కువ ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు తెలిపారు.

English summary

$500 మిలియన్ సమీకరించనున్న ఉడాన్, $2bn దాటనున్న స్టార్టప్ వాల్యుయేషన్ | B2B Unicorn Udaan in talks to raise $500 Mn funding round

B2B online marketplace Udaan is reportedly close to raise around $500 Mn in a fresh funding round led by Lightspeed Venture Partners and DST Global.
Story first published: Monday, July 29, 2019, 11:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X