ఈ కామర్స్ తో చేతులు కాల్చుకున్న డీమార్ట్

డీమార్ట్ ... మధ్య తరగతి ప్రజలకు హోల్ సేల్ డిస్కౌంట్స్ ను నేరుగా అందించి వాళ్ళ గ్రోసరీ కొనుగోళ్ళకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి పోయింది. దేశంలో కోట్ల మంది వినియోగ దారుల మనసులు గెలిచిన ఈ రిటైల్ దిగ్గజం... ఈ కామర్స్ విభాగంలో మాత్రం చేతులు కాల్చుకొంది. అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ కు చెందిన రిటైల్ చైన్ సంస్థే ... డీమార్ట్. 2005 లో ఏర్పాటైన ఈ కంపెనీ గత 5-6 ఏళ్లుగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సూపర్ మార్కెట్లు అంటే ఎమ్మార్పీ ధరలకే వస్తువులను విక్రయిస్తాయి అనే ఆలోచనను మార్చి వేసి... ప్రతి వస్తువుపై 5% తప్పనిసరి కనీస డిస్కౌంట్స్ అందించటం ద్వారా నగరాల్లోని మధ్య తరగతి వర్గాలను ఆకర్షించింది.

డీమార్ట్ దెబ్బకు ఇతర రిటైల్ చైన్లు సైతం ఇదే అమ్మకాల వ్యూహాలను అమలు చేయాల్సిన పరిస్థితిని సృష్టించింది. సరి కొత్త మార్కెటింగ్ వ్యూహాలు, అతి తక్కువ నిర్వహణ ఖర్చులతో రిటైల్ సెగ్మెంట్లోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా ఆవిర్భవించింది. ఓ వైపు డిస్కౌంట్స్ ఇస్తూనే డీమార్ట్ లాభాల బాట పడితే... డిస్కౌంట్స్ పెద్దగా ఇవ్వని కంపెనీలు నష్టాలను మూటకట్టు కోవడం చూశాం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన అవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రస్తుతం దేశంలో అత్యంత విలువైన రిటైల్ కంపెనీ కావడం విశేషం. అయితే, ఇంత సాధించిన కంపనీ మాత్రం ఒక విషయం లో చతికిల పడింది.

ముంబై లో ప్రయోగం...

ముంబై లో ప్రయోగం...

దేశం లో ఈ కామర్స్ ట్రెండ్ నడుస్తున్న క్రమం లో డీమార్ట్ .... ఈ రంగంలో ప్రయోగం చేయాలనీ తలపోసింది. ఇందుకు ముంబై మహా నగరాన్ని ఎంచుకోంది. డీమార్ట్ రెడీ పేరుతో రెండేళ్ల క్రితం దీనిని ప్రారంభించింది. ఎలాగూ సిటీ లో చాల స్టోర్లు ఉన్నాయి కాబట్టి సరుకుల డెలివరీ ఈజీ అవుతుందని తలపోసింది. వినియోగదారుల నుంచి స్పందన బాగానే వచ్చింది. అమ్మకాలు పెరిగాయి. కానీ నష్టాలు మాత్రం అమ్మకలకు సమానంగా ఉండటం ఈ సంస్థను నిరాశకు గురి చేసాయి. గతేడాది ఈ ఈ కామర్స్ విభాగం ఏకంగా రూ 51 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో వెల్లడించింది. అంతక్రితం ఏడాది రూ 42 కోట్ల అమ్మకాలను సాధించిన కంపెనీ ... దానిపై ఏకంగా రూ 48 కోట్ల నష్టాన్ని రుచి చూడడం గమనార్హం. అయితే, దీనిని తాము ప్రయోగాత్మకంగా మాత్రమే ప్రారంభించామని, ఈ రంగం పని తీరును అంచనా వేయడం దీనివల్ల సాధ్యపడుతుందని అవెన్యూ సూపర్ మార్ట్స్ సీఈఓ నెవిల్ నొరోన్హా వ్యాఖ్యానించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.

బిలియనీర్ దామని ....

బిలియనీర్ దామని ....

డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దామని ... దేశంలో ప్రస్తుతం ప్రముఖ బిలియనీర్ల క్లబ్ లో చేరిపోయారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ సంపన్నుల జాబితా లో భారత్ లోని అత్యంత సంపన్నుల్లో ఆయనకు 12 వ స్థానం దక్కింది. ఇదంతా ఆయన డీమార్ట్ స్టోరీలను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడంతో జరిగింది. పబ్లిక్ ఇష్యూ కు వచ్చిన ఈ కంపెనీ కి విశేష ఆదరణ లభించి రూ 40,000 కోట్ల మార్కెట్ కాప్ ను సాధించింది. కంపెనీలో మెజారిటీ వాటా తో దామని బిలియనీర్ అయిపోయారు.

డీమార్ట్ రెవిన్యూ అదుర్స్...

డీమార్ట్ రెవిన్యూ అదుర్స్...

కంపెనీకి కల్పతరువు ఐన డీమార్ట్ స్టోర్లు ... భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్త బడా రిటైల్ దిగ్గజాలతో పోల్చిన మెరుగైన రాబడిని అందిస్తుండటం విశేషం. ఒక అంచనా ప్రకారం డీమార్ట్ దేశంలో ప్రతి చదరపు అడుగు రిటైల్ స్థలంలో 530 డాలర్లు (సుమారు రూ 37,100) ఆర్జిస్తుండగా... ప్రపంచంలోనే అతిపెద్దది ఐన అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ రాబడి 450 డాలర్లు (సుమారు రూ 31,500) గా ఉంది. ఇక దేశీయంగా డీమార్ట్ తో పోటీ పడే ఫ్యూచర్ గ్రూప్ నకు చెందిన బిగ్ బజార్, ఆదిత్య బిర్లా గ్రూప్ నకు చెందిన మోర్ సూపర్ మార్కెట్లు కేవలం డిమార్ట్ ఆదాయంలో మూడో వంతు మాత్రమే ఆర్జిస్తుండటం విశేషం.

చేతులు కాలని కంపెనీ లేదు...

చేతులు కాలని కంపెనీ లేదు...

ఈ కామర్స్ రంగంలో దిగిన ఏ కంపెనీ కూడా చేతులు కాల్చు కోకుండా బయట పడలేదు. ఇందుకు ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్, జొమాటో, స్విగ్గి, బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్ ఇలా ఎవరు అతీతులు కాదు. కానీ అత్యంత పకడ్బందీ వ్యూహాలను అమలు చేసే డీమార్ట్ సైతం ఈ కామర్స్ రంగంలో చతికిల పడటం ఈ రంగంలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో నిరూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ కామర్స్ లో ప్రవేశం అంత తెలివైన నిర్ణయం కాదని వారు సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+