మారుతున్న కాలంతో పాటుగా వాతావరణ పరిస్థితులు మారాయి. ఎండాకాలం వచ్చిందంటే విపరీతమైన ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక ఎండాకాలం మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక ఒకప్పుడు విలాసవంతమైన మరియు ఇళ్లల్లోనే ఉండే ఏసీలు ఇప్పుడు మధ్యతరగతి వారి ఇళ్లల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఏసీ లేకుంటే ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఇక అంతేనా.. అబ్బా... ఏదైనా చిన్న ఏసి ఉంటే బాగుండు.. ఈ ఎండ నుంచి కాపాడుకోవడానికి అన్న ఫీలింగ్ వస్తోంది.ఆ ఫీలింగ్ పట్టుకున్నారో ఏమోగానీ సరిగ్గా అదే ఆలోచనతో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సోని ఓ కొత్త పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ తీసుకొచ్చింది.
దీనికి ఆ కంపెనీ రియాన్ పాకెట్ గా పేరు పెట్టింది. ఈ పాకెట్ ఏసీ సైజు మనం నిత్యం ఉపయోగించే స్మార్ట్ఫోన్ కన్నా చిన్నదిగా ఉంటుంది. ఇక దీన్ని ఉపయోగించాలంటే ఏసీ తో పాటుగా వారిచ్చె టీ షర్ట్ ని కొనుక్కోవాలి. వాటర్ ప్రూఫ్ గా ఉండే ఈ టీ షర్ట్ వేసుకొని అందులో ఈ ఎసి ని పెట్టుకొని మండుటెండల్లో నూ చల్లదనాన్ని ఆస్వాదించ వచ్చు. బ్యాటరీతో నడిచే ఈ పాకెట్ ఏసి స్మార్ట్ఫోన్ ద్వారా బ్లూ టూత్ ను ఉపయోగించి ఆన్ ఆఫ్ చేయవచ్చు. రెండు గంటలపాటు ఛార్జింగ్ చేస్తే 90 నిమిషాల పాటు ఇది పనిచేస్తుంది.

ఇంతకీ ఈ పోర్టబుల్ చేసి ధర చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నారేమో. వీటి ధర అక్షరాల 14080 యెన్ లు .. అంటే ఇండియన్ కరెన్సీలో 8992 రూపాయలు మాత్రమే. దీనిని లోపల వేసుకుని వాటర్ ప్రూఫ్ టీ షర్ట్ తో పాటుగా దీనిని విక్రయిస్తోంది కంపెనీ. రియాన్ పాకెట్ పోర్టబుల్ ఏసీలను సోనీ కంపెనీ క్రౌడ్ ఫండింగ్ ప్రోగ్రామ్ కింద తీసుకొస్తుంది. ఇక దీని కోసం 6.6 కోట్ల యెన్ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 2.8 కోట్ల యెన్ లు సమకూరాయి. చాలా తక్కువ ధర ఉంది.. మనకు అనుకూలంగా ఉంటుంది అని కొనేద్దాం అనుకునే వారికి మాత్రం చిన్న ట్విస్ట్. ప్రస్తుతానికి ఈ పోర్టబుల్ ఏసి జపాన్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక మన దేశంలో ఇది ఎప్పటి వరకు అందుబాటులో వస్తుందో.. అసలు భారత్ కు వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి ఈ పాకెట్ ఏసీ గురించి మరింత సమాచారం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications