ఆధ్యాత్మిక కంటెంట్ కు భలే గిరాకీ ... భారత్ లో డిజిటల్ ఆధ్యాత్మిక మార్కెట్ ఎంతో తెలుసా

ఇప్పుడు డిజిటల్ ప్రపంచం బాగా విస్తరించింది. ఎవరు ఏ సబ్జెక్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడుతున్నారు. అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటున్న నేటి తరుణంలో సామాజిక అంశాలపైన, సాహిత్య అంశాలైనా , ఆధ్యాత్మిక అంశాలైనా సరే అన్నిటినీ నెట్ ద్వారానే తెలుసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో ఆధ్యాత్మిక కంటెంట్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది.

ఆధ్యాత్మిక కంటెంట్ కు ఫుల్ క్రేజ్ .. దృష్టి పెట్టిన స్టార్టప్ కంపెనీలు

ఆధ్యాత్మిక కంటెంట్ కు ఫుల్ క్రేజ్ .. దృష్టి పెట్టిన స్టార్టప్ కంపెనీలు

ఎవరికి వారు భక్తి భావంలో మునిగిపోతూ ఆధ్యాత్మికతను పెంపొందించుకుంటున్నారు భారతీయులు . ఇక ఇలాంటి వారందరూ ఆధ్యాత్మిక పరమైన అంశాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ఆధారంగా వివిధ వెబ్ సైట్ లను బ్రౌజ్ చేస్తున్నారు.

దీంతో ప్రజలు ఆధ్యాత్మిక పరమైన కంటెంట్ ను ఎక్కువగా చూస్తున్నారనే విషయం గ్రహించిన పలువురు ఈ అవకాశాలను అందిపుచ్చుకోటానికి కొత్త స్టార్టప్ లను మొదలు పెట్టారు. ఆలయాలు, భక్తులు, గురువులు, ఆధ్యాత్మిక ప్రబోధాలు, ప్రవచనాలు మొదలైన వాటిని అన్నింటినీ అనుసంధానిస్తూ కొత్త కొత్త వెబ్ సైట్లు అవసరమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్నాయి. భారతదేశంలో మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన కంటెంట్ కు మంచి మార్కెట్ ఉందని గుర్తించిన స్టార్టప్ కంపెనీ లు మై మందిర్, ఆర్ జ్ఞాన్ , కాల్పనిక్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు ఈ కోవలోనే ఆధ్యాత్మికపరమైన కంటెంట్ ను అందరికీ అందిస్తున్నాయి.

ఆధ్యాత్మిక పోర్టల్స్ లో కావాల్సిన సమాచారం అంతా .. బిజీ లైఫ్ లో పోర్టల్స్ ను ఆశ్రయిస్తున్న యూజర్స్

ఆధ్యాత్మిక పోర్టల్స్ లో కావాల్సిన సమాచారం అంతా .. బిజీ లైఫ్ లో పోర్టల్స్ ను ఆశ్రయిస్తున్న యూజర్స్

ప్రస్తుతం మన దేశంలో షేర్ చాట్ వంటి సోషల్ నెట్వర్క్ ప్లాట్ ఫాం పై 25 మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వీరిలో యోగా గురు రాందేవ్ బాబా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇంకా మరి కొంతమందిని చేర్చుకుని 20 నుండి 25 కోట్ల మంది యూజర్లకు ఆధ్యాత్మిక సేవలను అందించాలని సదరు ఆధ్యాత్మిక కంటెంట్ ను నిర్వహిస్తున్న కంపెనీలు భావిస్తున్నాయి. ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు, వాటి ప్రత్యేకతలు, భక్తి మార్గాలు, ఆధ్యాత్మిక ప్రబోధాలు, స్వామీజీల ప్రవచనాలు ఇలా ఒకటేమిటి భక్తిమార్గంలో మునిగిపోయే అనేక అంశాల పైన దృష్టి పెట్టిన ఆధ్యాత్మిక పోర్టల్స్ తమ సేవలను మరింత విస్తరించాలని, ఎక్కువ మంది యూజర్లకు తమ సేవలను అందించాలని ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఆధ్యాత్మిక భావాలు ఉన్నప్పటికీ గుడికి వెళ్ళడానికి, అలాగే స్వామీజీల దగ్గరకు వెళ్లి వారి బోధనలను వినడానికి, ఆధ్యాత్మిక మార్గంలో ఆచరించ వలసిన విషయాలను తెలుసుకోవడానికి సమయం ఉండడం లేదు. కాబట్టి ఆధ్యాత్మిక భావాలున్న వారి కోసం ఈ ఆధ్యాత్మిక పోర్టల్స్ వారికి కావలసిన సమాచారాన్ని, వారికి అనుకూలంగా ఉన్న సమయంలో అందించడానికి పనిచేస్తున్నాయి.

 భారత్ లో ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల ఆధ్యాత్మిక పోర్టల్స్ మార్కెట్

భారత్ లో ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల ఆధ్యాత్మిక పోర్టల్స్ మార్కెట్

అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది స్వామీజీలకు లక్షల్లో భక్తులు ఉన్నారు. ఇక వారి ప్రవచనాలను ఆన్లైన్ ద్వారా ప్రసారం చేయడం వల్ల స్వామీజీ దగ్గరకు వెళ్లి ప్రవచనాలు వినలేని భక్తులందరికీ సైతం సంబంధిత న్యూస్ పోర్టల్స్ స్వామీజీ ఏం చెప్పారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా సదరు పోర్టల్స్ కు యూజర్స్ పెరగడమే కాకుండా ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా స్టార్టప్ వెబ్ సైట్లు ఆధ్యాత్మిక కంటెంట్ లపై దృష్టి సారిస్తున్నాయి. భారత్లో ప్రస్తుతం 30 బిలియన్ డాలర్ల ఆధ్యాత్మిక పోర్టల్స్ మార్కెట్ ఉంది అంటే ఎంతగా ప్రజలు ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. పండుగలు, పబ్బాలు, జాతకాలు, రాశి ఫలాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రబోధాలు అన్నీ కలిపి నడుస్తున్న ఆధ్యాత్మిక పోర్టల్ ప్రజలకు కావలసిన ఆధ్యాత్మిక భావాలను అందించడమే కాకుండా ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+