సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ ఉండక పోతే బ్యాంకులు ఖాతాదారుల నుంచి భారీ స్థాయిలో జరిమానాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఈ సొమ్ము వేల కోట్ల రూపాయలు ఉండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. మన దేశంలో ఉన్న 22 షెడ్యూల్డ్ బ్యాంకులు గత మూడేళ్ళ కాలంలోనే సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ లేనందుకు దాదాపు రూ. 10,000 కోట్ల జరిమానాను వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ బ్యాంకుల్లో 18 ప్రభుత్వ రంగ బ్యాంకులు (ఎస్ బీఐ, బ్యాంక్ అఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా), 4 ప్రైవేట్ బ్యాంకులు (ఐ సి ఐ సి ఐ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ సహా) ఉన్నాయి.
* కనీస నిల్వ లేనందుకు ఖాతాదారుల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేసిన జరిమానా మొత్తం 2017-18 సంవత్సరంతో పోల్చితే 2018-19 సంవత్సరంలో తగ్గింది.
* కానీ ఇదే కాలంలో ప్రయివేట్ రంగ బ్యాంకుల వసూళ్లు మాత్రం పెరిగాయి.

ఎంత నిల్వ ఉండాలంటే..
* రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారు తన ఖాతాలో కనీసం కొంత నిల్వను ఉంచాల్సిందే. ఇంతకు ముందు చాలా మంది తమ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును తీసుకునే వారు. ఇలాంటి ఖాతాల సంఖ్య పెరగడంతో బ్యాంకులు సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ ఉండాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చాయి. ఈ మేరకు నిల్వ ఉండకపోతే ఖాతాదారుల నుంచి జరిమానాను వసూలు చేస్తున్నాయి.
* ఉదాహరణకు మెట్రో నగరాలు, అర్బన్ ఏరియాల్లో ఎస్ బీ ఐ ఖాతాదారులు నెలవారీగా రూ. 3,000 సగటు నిల్వను కలిగి ఉండాలి. సెమీ అర్బన్ లో అయితే రూ. 2,000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1,000 ఉండాలి.
* ఒకవేళ సగటు నిల్వను కలిగి ఉండక పోతే ఎస్ బీ ఐ తక్కువగా ఉన్న నిల్వను బట్టి రూ. 5 నుంచి రూ. 15 వరకు (జీ ఎస్ టీ అదనం ) వసూలు చేస్తోంది.

కనీస నిల్వ లేకపోతే
* హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ విషయానికి వస్తే ఈ బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులు మెట్రో, అర్బన్ ఏరియాల్లో రూ.10,000, సెమీ అర్బన్ ఏరియాల్లో రూ. 5,000 నెలవారీ సగటు నిల్వను కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మూడు నెలల సగటు రూ. 2,500 ఉండాలి.
* కనీస నిల్వ లేకపోతే హెచ్ డీ ఎఫ్ సి బ్యాంకు మెట్రో/అర్బన్ ఏరియాల్లో రూ. 150 నుంచి రూ. 600 వరకు, సెమి అర్బన్ ఏరియాల్లో రూ. 270 నుంచి రూ.450 వరకు (జీ ఎస్ టీ అదనం) వసూలు చేస్తోంది.
* ఐ సి ఐ సి ఐ బ్యాంకు రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల విషయంలో మెట్రో, అర్బన్ ఏరియాల్లో సగటు నిల్వ రూ. 10,000, సెమీ అర్బన్ ఏరియాల్లో రూ. 5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,000 ఉండాలన్న నిబంధన విధించింది.
* ఒక వేళ నెలవారీ సగటు నిల్వ లేకపోతే మెట్రో, అర్బన్, సెమీ అర్బన్ , గ్రామీణ ప్రాంతాల్లో రూ. 100 తో పాటు కనీస నిల్వ కన్నా తగ్గిన మొత్తంపై 5 శాతం చార్జీ విధిస్తోంది.

ఈ ఖాతాలకు వర్తించవు..
* ఆర్బీఐ నిబంధనల మేరకు బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలకు కనీస నిల్వ అవసరం లేదు. ఇందులోకి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు కూడా వస్తాయి.
* కొన్ని బ్యాంకులు మరికొన్ని ఖాతాలపై కూడా కనీస నిల్వ లేనందుకు చార్జీలు విధించడం లేదు. ఎస్ బీ ఐ జన్ ధన్ ఖాతా లతో పాటు , నో ఫ్రిల్స్ ఖాతాలు , వేతన ఖాతాలు వంటి వాటికి కనీస నిల్వ నిబంధనను విధించడం లేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications