For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలోనే ఆపిల్ క్రెడిట్ కార్డు!

|

అదేంటి ఆపిల్ కంపెనీ ఐఫోన్లు కదా అమ్మేది? క్రెడిట్ కార్డు అంటారేమిటి? అనే డౌట్ రావడం సహజమే. కానీ స్మార్ట్ ఫోన్ల దిగ్గజం నిజంగానే ఆపిల్ బ్రాండ్ కింద క్రెడిట్ కార్డులను తీసుకు రాబోతోంది. ఇందుకోసం ఆల్రెడీ ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ గోల్డ్ మాన్ సాక్స్ తో జట్టు కట్టింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే ఆపిల్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయని బ్లూమ్బెర్గ్ వార్త సంస్థ వెల్లడించింది. ఆగష్టు 15 లోపే కార్డును ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందని అది పేర్కొంది. ఆపిల్ ఫోన్ కలిగి ఉన్న వారు వాలెట్ అప్ ద్వారా ఈ కార్డు ను ఆక్సిస్ చేయవచ్చు. ఐఓఎస్ 12.4 అప్డేట్ కలిగిన అన్ని ఫోన్ల లోనూ ఆపిల్ కార్డు ఇన్ బిల్ట్ గా లభించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఎగుమతుల్లో ముందంజలో తెలంగాణ, 5 ఏళ్లలో రెండింతలుఎగుమతుల్లో ముందంజలో తెలంగాణ, 5 ఏళ్లలో రెండింతలు

రెండు దిగ్గజాల కలయిక ...

రెండు దిగ్గజాల కలయిక ...

గోల్డ్ మాన్ సాక్స్ గ్రూప్ అమెరికాలోని పాత తరం ఆర్ధిక సేవల దిగ్గజం. మరి ఆపిల్ ఇంక్ మాత్రం సరికొత్త టెక్నాలజీ దిగ్గజం. విభిన్న రంగాల్లో పనిచోస్తోన్న ఈ రెండు మహా కంపెనీలు ఒకే వెదిక పైకి వచ్చి పనిచేయటం తొలిసారని నిపుణులు అభిప్రాయం పడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి ప్రవేశ పెట్టబోయే ఈ సరికొత్త కార్డు ద్వారా రెండు దిగ్గజాలు పనిని విభజించుకుని సమర్థవంతంగా పనిచేసేలా వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆపిల్ ఒక గొప్ప భాగస్వామి. వినియోగదారులు ఇష్టపడే ప్రతిష్టాత్మక ఉత్పత్తిని అందించేందుకు కుతూహలంగా ఎదురుచూస్తున్నాం అని గోల్డ్ మాన్ సాక్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించినట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొంది.

ఆపిల్ కు కొత్త తరహా ఆదాయం...

ఆపిల్ కు కొత్త తరహా ఆదాయం...

ఇప్పటి వరకు కేవలం ఐఫోన్ల అమ్మకాల ద్వారా మాత్రమే వినియోగదారుల నుంచి ఆదాయాన్ని పొందుతున్న ఆపిల్ కంపెనీకి... ప్రస్తుతం మార్కెట్ లోకి ప్రవేశ పెట్టె క్రెడిట్ కార్డు ద్వారా సరి కొత్త ఆదయ మార్గం ఏర్పడనుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా ఈ ఆదాయం నిలకడగా లభించే విధంగా ఉంటుందని వారు అంటున్నారు. అదే సమయం లో ఇప్పటి వరకు కేవలం వాల్ స్ట్రీట్ కంపెనీగా, పెట్టుబడుల సంస్థగా పేరున్న గోల్డ్ మాన్ సాక్స్ కూడా నేరుగా రోజువారీ వినియోగదారులకు సేవలు అందించటం సరికొత్త అనుభవమే. అందుకే మార్కెట్ వీటి కలయికను చాల ఆసక్తిగా గమనిస్తోంది. ఈ రెండు అమెరికా దిగ్గజాల భాగస్వామ్యం గురుంచి ఈ ఏడాది మర్చి లో ఆపిల్ కంపెనీ సీఈఓ టీమ్ కుక్ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

కాష్ బ్యాక్ లు ...

కాష్ బ్యాక్ లు ...

ఆపిల్ ప్రతిపాదిస్తున్న క్రెడిట్ కార్డు తొలుత సాఫ్ట్ కార్డు లేదా డిజిటల్ కార్డుగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఆపిల్ పే తో దీన్ని అనుఅనుసంధానం చేయబోతున్నారు. ఈ కార్డుపై ఫీజులు కూడా ఉండక పోవచ్చని చెబుతున్నారు. అదే సమయం లో కార్డు లావాదేలపై 1% కాష్ బ్యాక్, ఆపిల్ పే ద్వారా 2% కాష్ బ్యాక్, ఆపిల్ ప్రొడుక్ట్లులు కొనుగులో చేస్తే 3% కాష్ బ్యాక్ అందించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా... తొలుత గోల్డ్ మాన్ సాక్స్ సమర్పించిన క్రెడిట్ కార్డు పనితీరుపై ఆపిల్ అసంతృప్తి వ్యక్తం చేసిందట. కానీ ప్రస్తుతం అంత సర్దుబాటు అయిందని అంటున్నారు.

భారత్ లో సేవలు...

భారత్ లో సేవలు...

ప్రస్తుతం ఆపిల్ క్రెడిట్ కార్డు అమెరికా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అంటున్నారు. అక్కడ పరీక్షించిన తర్వాతే ఇతర మార్కెట్లకు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చేసున్న దేశంగానూ ... ఆపిల్ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ల లో ఒకటి కావటం వాళ్ళ భారత్ లో ఆపిల్ క్రెడిట్ కార్డు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary

త్వరలోనే ఆపిల్ క్రెడిట్ కార్డు! | Apple's credit card could arrive in August

The Apple Card, a high profile credit card partnership between Goldman Sachs and Apple, is scheduled to launch in the first two weeks of August, a person familiar with the project.
Story first published: Saturday, July 27, 2019, 12:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X