న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను గుర్తించేందుకు బయోమెట్రిక్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. రైల్వేస్‌ను మరింతగా పాసింజర్ ఫ్రెండ్లీగా చేసేందుకు కేంద్ర రైల్వే శాఖమంత్రి పీయూష్ గోయల్ తొలిసారిగా బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. జనరల్ క్లాస్‌లో అన్‌రిజర్వ్‌డ్ సీట్లను బయోమెట్రిక్ ద్వారా ప్రయాణీకులు గుర్తించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్టును వెస్టర్న్ రైల్వే డివిజన్‌లోని ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, బాంద్రా టెర్మినస్‌లో ప్రారంభించారు.

రైల్వే కోచ్‌ల బయోమెట్రిక్ సిస్టం
ఈ బయోమెట్రిక్ సిస్టం ద్వారా ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్‌ను మరింత ఫ్రెండ్లీగా చేయడంతో పాటు స్టేషన్‌ల వద్ద తొక్కిసలాట లేకుండా చేయడం ముఖ్య ఉద్దేశ్యం. రైళ్లు వచ్చి ఆగినప్పుడు స్టేషన్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల వద్ద తొక్కిసలాట పరిస్థితులు కనిపిస్తాయి. దీనిని నివారించడమే లక్ష్యం. ప్రధానంగా రైల్వే ప్రయాణీకులు కార్నర్ సీట్లలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి ఫిర్యాదులు చేస్తుంటారు.

ఈ బయోమెట్రిక్ సిస్టం ఎలా పని చేస్తుంది?
సాధారణ తరగతి కోచ్‌ల కోసం టిక్కెట్స్ కొనుగోలు చేసే ప్రయాణీకులు బయోమెట్రిక్ మెషీన్ వద్ద వారి వేలిముద్రలను స్కాన్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత టోకెన్ వస్తుంది. ఆ జనరల్ క్లాస్ కోచ్‌లో ఎన్ని సీట్లు ఉంటే అన్ని టోకెన్స్ మాత్రమే జనరేట్ అవుతాయి. అప్పుడు ప్రయాణీకులు ప్లాట్ ఫాం పైకి రైలు రావడానికి కాస్త ముందు తమ సీరియల్ నెంబర్ ఆధారంగా ఎక్కేందుకు క్యూలో నిలుచుంటారు. ఆర్పీఎఫ్ స్టాఫ్ జనరల్ క్లాస్ కోచ్ ఎంట్రీ పాయింట్ వద్ద ప్రయాణీకుల టోకెన్లను వెరిఫై చేస్తారు. వారిని ఓ ఆర్డర్‌లో రైలు ఎక్కేందుకు అనుమతిస్తారు.

ఏ రైళ్లకు వినియోగిస్తారు..
బయోమెట్రిక్ యంత్రాన్ని కింది రైళ్ల జనరల్ క్లాస్ కోచ్‌ల కోసం వినియోగిస్తారు.
- అమ్రావతి ఎక్స్‌ప్రెస్ (ముంబై సెంట్రల్ స్టేషన్)
- జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్)
-కర్ణావతి ఎక్స్‌ప్రెస్(ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్)
- గుజరాత్ మెయిల్ (ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్)
- గోల్డెన్ టెంపుల్ మెయిల్ (ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్)
- పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్ (బాంద్రా టెర్మినస్)
- అమ్రావతి ఎక్స్‌ప్రెస్ (బాంద్రా టెర్మినస్)
- అవద్ ఎక్స్‌ప్రెస్ (బాంద్రా టెర్మినస్)
- మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (బాంద్రా టెర్మినస్)

బయోమెట్రిక్‌తో అదనపు ప్రయోజనాలు
ప్రయాణీకులు క్యూలో జంప్ చేయకుండా ఆర్పీఎఫ్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అయితే దీని వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్లాట్ ఫామ్ వద్ద తొక్కిసలాట పరిస్థితిని దూరం చేస్తుంది. సీట్ల కేటాయంపులో అవినీతికి ఆస్కారం ఉండదు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు వేలి ముద్రల ద్వారా దొంగలను గుర్తించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

నాలుగు బయోమెట్రిక్ మిషన్ల ఏర్పాటు.. త్వరలో మరో 8
ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ 4 బయోమెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేసింది. రెండు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో, రెండు బాంద్రా టెర్మినస్ స్టేషన్‌లో ఏర్పాటు చేశాయి. మరింత ఆధునాతన మిషన్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఇది ప్రయాణీకుల ఫోటోలను తీసుకుంటుందని, తద్వారా జనరల్ క్లాస్ కోచ్‌లలో ఎక్కే ప్రయాణీకుల వీడియో రికార్డింగ్ అవసరాన్ని తొలగిస్తుందని వెస్టర్న్ రైల్వే సీపీఆర్ఓ రవీంద్ర భాస్కర్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ఆన్‌లైన్‌తో చెప్పారు. అహ్మదాబాద్, ముంబై డివిజన్లలో 4 చొప్పున మొత్తం 8 అడ్వాన్స్‌డ్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ మిషన్లను ఇండియన్ రైల్వే కొనుగోలు చేస్తోంది. ముంబై డివిజన్‌కు సంబంధించి రెండు సూరత్ స్టేషన్‌లో, మిగతా రెండింటిలో ఒకదానిని ముంబై సెంట్రల్, రెండోి బాంద్రా టర్మినస్ స్టేషన్‌లో ఏర్పాటు చేయనుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications