గుడ్‌న్యూస్: హైదరాబాద్‌వాసుల పార్కింగ్ కష్టాలు తీర్చేందుకు సరికొత్త యాప్
హైదరాబాద్: భాగ్యనగరంలో వాహనదారుల పార్కింగ్ ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ప్రయాణీకుల కోసం ఇబ్బందిలేని పార్కింగ్‌ను అందించేందుకు స్మార్ట్ పార్కింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. దీని కోసం ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి రానుంది. 24 మెట్రో స్టేషన్‌లలో పార్కింగ్ ఫెసిలిటీని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

పార్కింగ్ స్థలం సెర్చ్ చేసి, బుక్ చేసుకోవచ్చు
ఈ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చాక, నగరంలోని మెట్రో ప్రయాణీకులు మొబైల్ యాప్ ద్వారా పార్కింగ్ స్థలాలను సెర్చ్ చేసి, బుక్ చేసుకోగలుగుతారు. ఈ కొత్త ప్రాజెక్టు క్లౌడ్ ఆధారిత పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంతో ప్రయాణీకులను పార్కింగ్ స్థలాలు బుక్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా HMRL 'పార్క్ హైదరాబాద్'ను ప్రారంభించింది. దీనికి డబ్బులు వసూలు చేస్తారు.

గెట్ మై పార్కింగ్
ఈ పార్కింగ్ ఆపరేషన్స్‌ను జురు సొల్యూషన్స్ నిర్వహిస్తుంది. ఇది ప్రయాణీకుల పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపర్చేందుకు పలు సూచనలు మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులు ఈ యాప్ ద్వారా డిజిటైజేషన్ పార్కింగ్ టిక్కెట్‌తో తమ వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్‌ల యూజర్లు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Get My Parking యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

రీఅలోకేషన్ ఫోటోలు పొందవచ్చు
ఈ యాప్ ద్వారా కేవలం పార్కింగ్ స్థలాన్ని సెర్చ్ చేయడం, బుక్ చేసుకోవడంతో పాటు టైమింగ్స్, టారిఫ్, రూల్స్, రీఅలోకేషన్ ఫోటోలు కూడా పొందవచ్చు. ఈ ప్రాజెక్టు గురించి గేట్ మై పార్కింగ్ సహ వ్యవస్థాపకులు పన్సారే మాట్లాడుతూ... ఆన్ స్ట్రీట్ పార్కింగ్ కోసం ఈ రకమైన స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థలో ఇది మొదటిది అని, ఇది తమకు గొప్ప అవకాశమని, స్టార్టప్, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న HMRL కృతజ్ఞతలు అన్నారు.


Click it and Unblock the Notifications