కిషోర్ బియాని సంస్థ లోకి 250 మిలియన్ డాలర్ల బ్లాక్ స్టోన్ పెట్టుబడి

రిటైల్ దిగ్గజం కిషోర్ బియానికి చెందిన ఫ్యూచర్ ఫ్యాషన్స్ సంస్థ లోకి భారీ పెట్టుబడి రానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఈ పెట్టుబడిని సమకూర్చనుంది. అమెరికాకు చెందిన బ్లాక్ స్టోన్ సంస్థ కిషోర్ బియాని కి సంబంధిచిన ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ అనే కంపెనీల్లోకి 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ 1,750 కోట్లు ) మూలధనాన్ని పెట్టుబడిగా పెడుతోందని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం లో వెల్లడించింది. ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియాని సారధ్యం లో బిగ్ బజార్, సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ వంటి ప్రముఖ రిటైల్ చైన్స్ నడుస్తోన్న విషయం తెలిసిందే. తాజా నిధుల్లో కొంత మేరకు ఈక్విటీ రూపం లోనూ మరికొంత మొత్తం క్రమానుగత రుణంగా లభించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

బ్రాండ్ ఫ్యాక్టరీ విస్తరణ ....

బ్రాండ్ ఫ్యాక్టరీ విస్తరణ ....

అత్యంత భారీ డిస్కౌంట్స్ తో దుస్తులు, లైఫ్ స్టైల్ వస్తువులు విక్రయించే ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ సంస్థ బ్రాండ్ ఫ్యాక్టరీ విస్తరణ కోసం ప్రస్తుత పెట్టుబడులను వినియోంచనున్నారు. అమెరికా లోని టీజె మాక్స్ అనే బ్రాండ్ తరహాలోనే బ్రాండ్ ఫ్యాక్టరీ నడుస్తోంది. అమెరికాలోకి మల్లె మన దేశంలోనూ బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రజాదరణ పొందటం విశేషం. ఈ పెట్టుబడి తో బ్లాక్ స్టోన్ కు కంపెనీలో 6-7 శాతం వాటా లభించనుంది.

బియాని వాటా 53 శాతం...

బియాని వాటా 53 శాతం...

లిస్ట్ ఐన ఈ కంపెనీలో కిషోర్ బియాని .. అయన కుటుంబ సంస్థలకు సంయుక్తంగా 53.43% వాటా ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ లో దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. దేశేయ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు దీనిపై పోస్తివిగానే ఉన్నారు. జీవిత బీమా సంస్థ (ఎల్లైసీ) కు 6.5% వాటా ఉండగా.. ఎల్ కాటెరిటన్, ప్రేమజీ ఇన్వెస్ట్ కు 17%, ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్ కి 4% వాటాలు ఉన్నాయి.

రూ 9,000 కోట్ల మార్కెట్ కాప్...

రూ 9,000 కోట్ల మార్కెట్ కాప్...

లైఫ్ స్టైల్ వస్తువుల విక్రయం లో నిమగమైన ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ... ప్రస్తుత మార్కెట్ విలువ రూ 9,008 కోట్లుగా ఉంది. కాగా ఐసీఐసీఐ బ్యాంకు, అపోలో గ్లోబల్ మానేజ్మెంట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన AIOYN అనే పెట్టుబడి సంస్థ ఫ్యూచర్ లైఫ్ స్టైల్ కు వెన్ను దన్నుగా ఉంది. ఈ కంపెనీ 2017 లో సుమారు రూ 100 మిలియన్ (రూ 700 కోట్లు) పెట్టుబడి పెట్టి కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుత పెట్టుబడి నుంచి ఈ సంస్థకు సుమారు 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 350 కోట్లు ) ప్రతిఫలంగా దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

90 నగరాలూ ... 300 స్టోర్లు...

90 నగరాలూ ... 300 స్టోర్లు...

ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేసిన బ్రాండ్ ఫ్యాక్టరీ, సెంట్రల్ బ్రాండ్లు దేశంలో వేగంగా విస్తరించాయి. దేశంలోని 90 ప్రముఖ నగరాల్లో 300 స్టోర్లు వీటి సొంతం. ఈ కంపెనీ ఆధ్వర్యంలో 57 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ ఉంది. ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ వెంచర్స్ అనే రెండు కంపెనీలుగా ఏర్పాటు చేసినప్పుడు దీనికి బీజం పడింది.

లాభాల్లో నే కంపెనీ...

లాభాల్లో నే కంపెనీ...

భారీ డికౌంట్స్ ఇచ్చినప్పటికీ... ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ లాభాల్లో నే నడుస్తుండటం విశేషం. గత ఆర్థిక సంవత్సరం లో (2018-19) లో ఈ కంపెనీ ఏకంగా రూ 5,728 కోట్లా ఆదాయం పై రూ 189 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. డీప్ డిసౌన్స్ ఇచ్చే బ్రాండ్ ఫ్యాక్టరీ సేల్స్ లో ముందున్నది అనలిస్టుల అంచనా. ఇందులో వృద్ధి 14% కాగా... ఇతర బ్రాండ్ల లో వృద్ధి రేటు 10% లోపే ఉంది. వృద్ధి ఎంతున్నా ... కంపెనీ లాభాల్లో ఉండటంతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా... ఈ పెట్టుబడి విషయంపై ఇటు కిషోర్ బియాని కానీ... అటు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్ స్టోన్ కానీ స్పందించలేదని ఈటీ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+