న్యూఢిల్లీ: ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీం కోర్టు యాజమాన్యానికి షాకిచ్చే తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. గ్రూప్ అధికారులపై మనీ లాండరింగ్ కేసులు నమోదు చేయాలని, ఈడీని ఆదేశించింది భారత అత్యున్నత న్యాయస్థానం. ఆమ్రపాలి గ్రూప్ పెద్ద ఎత్తున నిధులను మళ్లించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమ్రపాలిలో చాలామంది ఇళ్లు కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు పెట్టారు. వాటిని యాజమాన్యం దారి మళ్లించింది.

రూ.5.88 కోట్ల బంగారం కొనుగోలు
హోమ్ బయ్యర్స్ నుంచి సేకరించిన డబ్బులతో ఆమ్రపాలి గ్రూప్ పెద్ద ఎత్తున బంగారం కూడా కొనుగోలు చేసిందంట. నోయిడాకు చెందిన డైమండ్ వ్యాపారి నుంచి బంగారు కడ్డీలు కొనుగోలు చేసిందట. ఆమ్రపాలి గ్రూప్‌లోని సీనియర్ అధికారులు రూ.5.88 కోట్ల విలువైన పసిడిని, పసిడి బార్స్‌ను కొనుగోలు చేశారు. వీటిని వారి వ్యక్తిగత ఉపయోగం కోసం కొనుగోలు చేశారు. వాటిని పర్సనల్ యూజ్ కోసం కొనుగోలు చేసినప్పటికీ, అధికారులు మాత్రం లెక్కల పుస్తకాల్లో ఫెస్టివెల్ ఖర్చుల కింద చూపెట్టడం గమనార్హం.

amrapali
ఆమ్రపాలి గ్రూప్ పెద్ద ఎత్తున డబ్బును మళ్లించింది. బంగారం కొనుగోలు అంశంపై కోర్టు కూడా స్పందించింది. ఇది సాధారణంగా ఆఫీస్ ఉపయోగం కోసం కొనుగోలు చేసినట్లుగా లేదని, వ్యక్తిగత ఖర్చుల కోసమే తీసుకున్నట్లుగా అర్థమవుతోందని, ఈ మొత్తాన్ని కంపెనీ మేనేజ్‌మెంట్ నుంచి రికవరీ చేయాలని స్పష్టం చేసింది. ఆమ్రపాలి గ్రూప్ నోయిడాకు చెందిన యషికా డైమండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో నలుగురు డైరెక్టర్లుగా ఉన్నారు.

డైమండ్ కంపెనీ మూలధనం
పబ్లిక్ డొమైన్‌లో దొరికిన సమాచారం మేరకు.. దీని ఆథరైజ్డ్ మూలధనం రూ.30,000,000 గా ఉందని ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెయిడ్ అప్ కేపిటల్ రూ.27,429,500గా ఉందట. కాగా, ఆమ్రపాలి గ్రూప్ రెరా రిజిస్ట్రేషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతని ప్రభుత్వరంగ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ (NBCC)కి అప్పగించింది. వేలాదిమంది గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట. చాలామంది ఇంటి కోసం ఆమ్రపాలిలో లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. దాదాపు 42వేల మంది ఈ గ్రూప్‌లో అపార్టుమెంట్స్ బుక్ చేసుకుంది. దీనిని ప్రమోటర్లు పక్కదారి పట్టించారు. బాధితుల న్యాయ పోరాటం కారణంగా సుప్రీం కోర్టులో వారికి ఊరట లభించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications