స్టాక్ మార్కెట్లో వరుసగా ఆరో రోజూ నష్టాల దెబ్బ గట్టిగానే పడింది. జూలై సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ కావడంతో ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగింది ట్రేడింగ్. బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ట్రెండ్ కొనసాగింది. 11290 పాయింట్ల దగ్గర స్వల్ప నష్టాలతో మొదలైన నిఫ్టీ ప్రారంభంలోనే 11361 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ వెళ్లింది. అయితే ఎక్స్‌పైరీ కావడంతో నిఫ్టీ లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడింది. ఆఖరి గంటలో 11239 పాయింట్ల కనిష్ట స్థాయివరకూ పడిపోయిన నిఫ్టీ, 20 పాయింట్లు కోల్పోయి చివరకు 11252 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 17 పాయింట్ల నష్టంతో 37831 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫఅటీ మాత్రం 91 పాయింట్లు పెరిగి 29043 దగ్గర స్థిరపడింది.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు పావు శాతానికిపైగా లాభాలతో క్లోజయ్యాయి. ఇక సెక్టోరల్ సూచీల్లో మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసిజి, ఆటో స్టాక్స్ నష్టపోయాయి. బ్యాంకింగ్, మీడియా, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ షేర్లు లాభపడ్డాయి.

వేదాంతా, సిప్లా, జీ ఎంటర్‌టైన్మెంట్, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా, జెఎస్‌డబ్ల్యు స్టీల్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.
మేజర్ న్యూస్
కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సుభాష్ చంద్ర గార్గ్‌ను ఉన్నట్టుండి ఇతర శాఖకు బదిలీ చేయడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, సూపర్ రిచ్ ట్యాక్స్ వంటివి ఈయన బ్రెయిన్ చైల్డ్స్ కావడం ప్రధానంగా గమనించాల్సిన అంశం.
బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ బాగున్నాయ్.. కానీ..
బజాజ్ ఫైనాన్స్ మెరుగైన త్రైమాసిక ఫలితాలనే వెల్లడించింది. నికర లాభం 43 శాతం, రెవెన్యూ 47 శాతం పెరిగాయి. రూ.1195.25 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను సంస్థ ఆర్జించింది. కనీస వడ్డీ ఆదాయం 43 శాతం పెరిగింది. మొండిబకాయిలు కూడా స్థిరంగానే ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఇదే స్థాయిలో వృద్ధి ఉంటుందనే నమ్మకాన్ని యాజమాన్యం కల్పించలేకపోయింది. దీంతో స్టాక్ ఈ రోజు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. చివరకు 4 శాతం నష్టంతో రూ.3046 దగ్గర క్లోజైంది.
సాగర్ సిమెంట్స్ 10 నెలల గరిష్టం
వరుసగా రెండో రోజూ లాభపడడంతో పది నెలల గరిష్ట స్థాయికి చేరింది సాగర్ సిమెంట్స్ స్టాక్. ఇథర సిమెంట్ స్టాక్స్ భారీగా నష్టపోయినా ఇది మాత్రం నిలదొక్కుతుంది. గత ఏడాది కాలంలో ఈ స్టాక్ పదకొండు శాతం నష్టాలకే పరిమితమైంది. ఈ రోజు 7 శాతానికి పైగా లాభాలతో రూ.664 దగ్గర ముగిసింది.
ఇంటెలెక్ట్ డిజైన్‌కు రిజల్ట్స్ దెబ్బ
సంస్థ ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయం 13.3 శాతం, నికర లాభం 92 శాతం క్షీణించింది. ఎబిట్ కూడా 82.6 శాతం తగ్గింది. మార్జిన్లు కూడా 11 నుంచి 2 శాతానికి తగ్గాయి. దీంతో 4.5 శాతం నష్టపోయిన స్టాక్ రూ.238 దగ్గర క్లోజైంది.
టాటా మోటార్స్.. ప్చ్..
టాటా మోటార్స్ మార్కెట్ ట్రేడింగ్ సమయం తర్వాత భారీ నష్టాలతో రిజల్ట్స్ ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని ముందే గ్రహించిన మార్కెట్లు.. టాటా మోటార్స్ స్టాక్‌ను పడేశాయి. స్టాక్ ఇంట్రాడేలో 5 శాతం వరకూ పడిపోయింది. గత మూడు నెలల కాలంలో స్టాక్ పాతిక శాతం పతనం కావడం ప్రధానంగా గమనించాల్సిన అంశం. చివరకు స్టాక్ 5 శాతం నష్టంతో రూ.144 దగ్గర క్లోజైంది.
తిరుమలైకీ రిజల్ట్సే షాక్
సంస్థ ఈ రోజు వెల్లడించిన ఫలితాల్లో నికర లాభం 62 శాతం క్షీణించింది. ఆదాయం 12 శాతం వృద్ధి చెందినప్పటికీ భారీ నష్టాలు స్టాక్‌ను నష్టాలబాటలోకి నడపించాయి. చివరకు స్టాక్ 9 శాతం నష్టంతో రూ.61 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications