For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

35,000 కోట్ల భారీ జరిమానా చెల్లించేందుకు ఫేస్‌బుక్ రెడీ

|

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 5 బిలియన్ డాలర్ల (రూ.35,000 కోట్లు) జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇటీవల వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతలో నిబంధనలు ఉల్లంఘించినందుకు నియంత్రణ సంస్థ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ భారీ జరిమానా విధించింది. దీనిని చెల్లించేందుకు ఫేస్‌బుక్ అంగీకరించింది.

ఓ కంపెనీపై విధించిన అత్యంత భారీ జరిమానా ఇది కావాడం గమనార్హం. జరిమానాతో పాటు కొత్త నిబంధనలు, మోడిఫైడ్ కార్పోరేట్ స్ట్రక్చర్‌కు కూడా ఫేస్‌బుక్ అంగీకారం తెలిపింది. వినియోగదారుల గోప్యత గురించి తీసుకునే నిర్ణయాలకు కంపెనీ జవాబుదారీగా ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికాలో మరే కంపెనీపై ఇంత భారీ జరిమానా విధించలేదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ కూడా 100 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు?రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు?

Facebook agrees to pay $5bn penalty for privacy violations

యూజర్ల పర్సనల్ ఇన్‌ఫర్మేషన్ రిస్క్‌కు సంబంధించి తప్పుదోవ పట్టించే ధ్రువీకరణలు అందించినందుకు ఫేస్‌బుక్ పైన 100 మిలియన్ డాలర్ల జరిమానాను మార్కెట్ల నియంత్రణ సంస్థ విధించింది. ఈ మొత్తం చెల్లించేందుకు కూడా ఫేస్‌బుక్‌ అంగీకరించింది.

యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంపై నియంత్రణ వారికే ఉండేలా చూస్తామని ఫేస్‌బుక్ పలుమార్లు హామీ ఇచ్చినా, అమలు మాత్రం కాలేదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ పేర్కొంది. ఫేస్‌బుక్ డైరెక్టర్ల బోర్డులోనే స్వతంత్ర వ్యక్తిగత గోప్యతా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

English summary

35,000 కోట్ల భారీ జరిమానా చెల్లించేందుకు ఫేస్‌బుక్ రెడీ | Facebook agrees to pay $5bn penalty for privacy violations

Facebook reported better than expected earnings and revenue on Wednesdays as advertisers continued flocking to the site.
Story first published: Thursday, July 25, 2019, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X