శాలరైడ్‌కు ఆయా బ్యాంకులు కొన్ని ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఈ బ్యాంకులు ఎన్నో ప్రయోజనాలతో కూడిన ఆఫర్లు ఇస్తుంటాయి. ఆయా సెక్టార్లకు చెందిన ఉద్యోగులు శాలరీ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వెసులుబాటు కల్పిస్తోంది. ఆయా రంగాన్ని బట్టి శాలరీ స్పెషల్ అకౌంట్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, డిఫెన్స్ ఫోర్సెస్, ఇతర సంస్థల ఉద్యోగులకు వివిధ రకాల ప్యాకేజీలు అందిస్తోంది. మీరు ఇండియన్ రైల్వే ఉద్యోగి అయి ఉంటే, మీరు ఎస్బీఐలో శాలరీ అకౌంట్ తెరవాలనుకుంటే... ఏయే ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.

మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
మీరు రైల్వే ఉద్యోగి అయితే ఎస్బీఐలో అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రమాద బీమా, అపరిమిత ఎటిఎం లావాదేవీలు, డీమాట్ ఖాతా, ఆకర్షణీయ రుణ వడ్డీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు... ఇలా ఎన్నో ఉన్నాయి. వీరి అకౌంట్‌ను రైల్వే శాలరీ ప్యాకేజీ (RSP) అంటారు. అలాగే, అనేక రకాల ప్రయోజనాలు, సేవలను కూడా అందిస్తుంది. అలాగే సురక్షిత నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని యాక్సెస్ చేస్తుంది. ఈ కస్టమర్స్ తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదు.

ఎస్బీఐ రైల్వే శాలరీ ప్యాకేజీ.. వేతనం ఆధారంగా కేటగిరీలు
ఈ అకౌంట్ ఇండియన్ రైల్వేస్, కోల్‌కతా మెట్రో, కొంకణ్ రైల్వే కార్పొరేషన్, ముంబై మెట్రో, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ ఉద్యోగుల కోసం ఉద్దేశించబడింది. రైల్వే ఉద్యోగుల నెలవారీ జీతం ఆధారంగా ప్యాకేజీని వివిధ కేటగిరీలుగా విభజించారు. విభిన్న ప్యాకేజీలు ఉన్నాయి.

ఎంత వేతనం ఉంటే ఏ కేటగిరీ?
- సిల్వర్- నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు వేతనం ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు.
- గోల్డ్ - నెలకు రూ.25,000 నుంచి రూ.50,000 వరకు వేతనం ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు.
- డైమండ్ - నెలకు రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు వేతనం ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు.
- ప్లాటినం - నెలకు రూ.1,00,000 లేదా అంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు.

ఉద్యోగులకు ప్రయోజనాలు
- జీరో బ్యాలెన్స్ అకౌంట్, అన్‌లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్.
- రూ.20 లక్షల వరకు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ (డెత్) కవర్.
- కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డెత్) రూ.30 లక్షలు.
- ఆకర్షణీయమైన పర్సనల్ లోన్, గృహ రుణాలు, కారు లోన్లు, విద్యా రుణాలు. ఈ రుణాల తీసుకున్నప్పుడు కూడా ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు మినహాయింపు ఉంటుంది.
- లాకర్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపు.
- ఇ-మోడ్స్ (మల్టీ ఆప్షన్ డిపాజిట్లు). అధిక వడ్డీ పొందవచ్చు.
- డీమాట్ అకౌంట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్.
- డ్రాఫ్ట్స్, మల్టీ సిటీ చెక్కులు, ఎస్ఎమ్ఎస్ ఎలర్టులు ఉచితం. ఉచిత ఆన్‌లైన్ NEFT/RTGS (ఇప్పుడు ఆర్బీఐ వీటిపై ఛార్జీలు విధించడం లేదు.)
- ఓవర్ డ్రాఫ్ట్ 2 నెలల నెట్ శాలరీకి సమానం (ప్రస్తుతం ఎంచుకున్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది).
- ఎస్పీఐ రివార్డ్స్ ప్రోగ్రామ్ ద్వారా వివిధ ట్రాన్సాక్షన్లపై పాయింట్లు ఉంటాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications