స్టాక్ మార్కెట్లో వరుసగా ఐదవ రోజూ లాభాలు ఆవిరైపోయాయి. నష్టాల ధాటి నానాటికీ పెరుగుతోంది. కీలకమైన లెవెల్స్ అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే వరుసగా ఐదో రోజూ నిఫ్టీ ఈ స్థాయిలో పతనాన్ని చూస్తోంది. బ్యాంకులకు తోడు ఈ రోజు మెటల్స్ కూడా కరిగాయి. 11322 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ 11359 వరకూ వెళ్లింది. అక్కడి నుంచి ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. ఓ దశలో 11230 వరకూ దిగొచ్చిన నిఫ్టీ మళ్లీ 11300 వరకూ వచ్చింది. మళ్లీ అక్కడ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. చివరకు 60 పాయింట్ల నష్టంతో 11271 దగ్గర క్లోజైంది నిఫ్టీ. సెన్సెక్స్ 135 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 176 పాయింట్లు దిగొచ్చింది.
మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులో ఒకటిన్నర నుంచి రెండు శాతం నష్టపోయాయి. ఇక సెక్టోరల్ సూచీల్లో మీడియా ఒక్కటే కాస్త ఫరవాలేదనిపించింది. మిగిలిన వాటిల్లో మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో, రియాల్టీ అత్యధికంగా నష్టపోయాయి.

జీ ఎంటర్‌టైన్మెంట్, ఏషియన్ పెయింట్స్, హిందుస్తాన్ యునిలివర్, హెచ్ డి ఎఫ్ సి, హెచ్ సి ఎల్ టెక్ టాప్ ఫైవ్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. యూపీఎల్, అదానీ పోర్ట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లూజర్స్ జాబితాలో చేరాయి.
జీ ఎంటర్‌టైన్మెంట్‌కు రిజల్ట్స్ కిక్
జీ ఎంటర్‌టైన్మెంట్స్ నిన్న మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడానికి తోడు రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రమోటర్లు చర్చలు తుది దశకు చేరుతున్న నేపధ్యంలో స్టాక్‌లో బూస్ట్ వచ్చింది. జీ లో వాటాల కొనుగోలుకు రెండు సంస్థల నుంచి బిడ్లు వచ్చిట్టు ప్రకటించిన సంస్థ త్వరలో వాటిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ నేపధ్యంలో జీ 5 శాతానికిపైగా పెరిగి రూ.380 దగ్గర క్లోజైంది.
కెఆర్‌బిఎల్‌లో మూడో రోజూ...
మూడో రోజూ వరుసగా కెఆర్‌బిఎల్ స్టాక్ లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా పది రెట్లు పెరిగాయి. స్టాక్ ఇంట్రాడేలో 15 శాతం వరకూ పెరిగింది. చివరకు స్టాక్ 9 శాతం లాభాలతో రూ.239 దగ్గర ముగిసింది.
విదేశీ బ్యాంక్ శాఖలు క్లోజ్
యాక్సిస్ బ్యాంక్ తనకు విదేశాల్లో ఉన్న సగానికి పైగా బ్యాంక్ శాఖలను మూసేసింది. హాంకాంగ్, షాంఘై, కొలంబోలలో తనకు ఉన్న శాఖలను మూసేసినట్టు ప్రకటించింది. స్టాక్ 2.5 శాతం నీరసించి రూ.710 దగ్గర క్లోజైంది.
ఏషియన్ పెయింట్స్ భళా
తన త్రైమాసిక ఫలితాల్లో రెవెన్యూ 17 శాతం, నికర లాభం (రూ.655 కోట్లు) 17 శాతం వృద్ధిని నమోదు చేసింది ఈ సంస్థ. దీంతో ఈ మార్కెట్లో కూడా స్టాక్ 3.8 శాతం పెరిగి రూ.1483 దగ్గర క్లోజైంది.
ఆరో సెషన్‌లోనూ ఆవిరి
కజారియా సిరామిక్స్ స్టాక్ వరుసగా ఆరో రోజూ నష్టాలతో ఆవిరైపోయింది. వరుస పతనాలు ఏడాదిలో ఇదే మొదటిసారి. ఈ మధ్య ప్రకటించిన ఫలితాలు అంత ఆసక్తికరంగా లేకపోవడం ముఖ్యమైన అంశం. నికర లాభం 12 శాతం, ఆదాయంలో 7 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. దీంతో స్టాక్ ఈ రోజు కూడా 9 శాతం నష్టాలతో రూ.467 దగ్గర ముగిసింది.
ఎం అండ్ ఎం ఫైనాన్స్‌కు రిజల్ట్స్ దెబ్బ
నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన నేపధ్యంలో మహీంద్రా ఫైనాన్స్ స్టాక్‌ను మార్కెట్లు పనిష్ చేశాయి. నిరర్థక ఆస్తులు పెరగడం, లాభాలు దారుణంగా పడిపోవడంతో స్టాక్ ఏకంగా 10 శాతం పతనమైంది. ఓ దశలో రూ.290 వరకూ వెళ్లిన స్టాక్ రూ.305 దగ్గర క్లోజైంది.
300 స్టాక్స్ మటాష్
మూడువందలకు పైగా స్టాక్స్ ఈ రోజు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ప్రధానంగా ఆల్ఫాజియో, అపార్ ఇండస్ట్రీస్, అపోలో మైక్రో, అపోలో టైర్స్, అశోక్ లేల్యాండ్, అరబిందో ఫార్మా, భారత్ బిజిలీ, భారత్ ఫోర్జ్, బాష్, కేర్ రేటింగ్స్, ఐషర్ మోటార్స్, ఎక్సెల్ క్రాప్ కేర్, గ్లెన్ మార్క్, గోద్రెజ్ కన్స్యూమర్, హెరిటేజ్ ఫుడ్స్, ఐఎఫ్‌బి ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, నాల్కో, న్యూక్లియస్ సాఫ్ట్, ప్రికాల్, పేజ్ ఇండస్ట్రీస్, రూపా అండ్ కంపెనీ, వాల్‌చంద్ నగర్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications