న్యూఢిల్లీ: ప్రమోటర్ రానా కపూర్ తన కూతుళ్ల వెంచర్ల కోసం సెక్యూరిటీగా యస్ బ్యాంకు షేర్లను తనఖా పెట్టారు. ఈ విషయం తెలియడంతో మంగళవారం యస్ బ్యాంకు షేర్లు 4 శాతం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. రానా కపూర్ 4.31 శాతం కలిగిన10 కోట్ల షేర్లను తనఖా పెట్టాడు. యస్ బ్యాంకులో గల తమ వాటాలోని కొంత భాగాన్ని మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేటు లిమిటెడ్ కూడా తాకట్టు పెట్టింది. దీంతో బ్యాంకు షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

బ్యాంక్ షేర్లు తనఖా
తమ కూతుళ్ల వ్యవస్థాపక ప్రయత్నాల కోసం యస్ బ్యాంకులో ఉన్న తన సొంత వాటాలను తనఖా పెట్టానని రానా కపూర్ వెల్లడించాడు. మోర్గాన్ క్రెడిట్స్ సంస్థకు అసురక్షిత రుణాలు ఉన్నట్లు తెలిపాడు. ఈ కంపెనీ రానా కపూర్ కుమార్తెలు రాధా కన్నా, రాఖీ టాండన్, రోష్నీ కపూర్ ఆధ్వర్యంలో నడుస్తోంది.

సెక్యూరిటీ డిపాజిట్‌గా..
రానా కపూర్ 4.31 శాతం వాటాను సెక్యూరిటీ డిపాజిట్‌గా తనఖా పెట్టగా, మోర్గాన్ క్రెడిట్స్ కూడా తమ వాటాలో 3.03 శాతం (7.02 కోట్ల షేర్లు) తాకట్టు పెట్టారు. జూలై 18-22 మధ్య కాలంలో వీటిని తనఖా పెట్టారు. ఈ విషయాన్ని బీఎస్ఈ ఫైలింగ్‌లో యస్ బ్యాంక్ తెలిపింది. ఇద్దరు ప్రమోటర్లు కలిపి యస్ బ్యాంకుకు చెందిన 7.34 శాతం షేర్లు తనఖా పెట్టారు.

ప్రమోటర్ 19.78 వాటా
ప్రమోటర్ సంస్థ అయిన మోర్గాన్ క్రెడిట్స్ (MPCL) జారీ చేసిన డిబెంచర్ల కోసం సెక్యూరిటీగా తాకట్టు పెట్టారు. MPCL జారీ చేసిన డిబెంచర్లను కలిగి ఉన్నవారి ప్రయోజనం కోసం డిబెంచర్ ట్రస్టీ మైల్‌స్టోన్ ట్ర్సస్టీషిప్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు ఫేవర్‌గా ఈ ఇద్దరు ప్రమోటర్స్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2019 చివరి నాటికి ఈ బ్యాంకులో ప్రమోటర్ వాటా 19.78 శాతంగా ఉంది. ఇందులో రానా కపూర్, అతని సతీమణి వాటా 11.88 శాతం.

నష్టాల నుంచి కాస్త లాభాల్లోకి...
షేర్ల తనఖా వార్తల నేపథ్యంలో యస్ బ్యాంకు షేర్లు ఇంట్రాడేలో మంగళవారం ఉదయం 4.4 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత కోలుకొని, 2 శాతం వరకు లాభపడింది. మధ్యాహ్నం ఒకటింపావుకు 0.70 శాతం వద్ద లాభంతో ట్రేడ్ అయింది. రూ.92కు అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications