లండన్: భారతీయ బ్యాంకుల నుంచి వేలకోట్ల అప్పులు తీసుకొని, లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు షాక్ తగిలింది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం... యూకే హైకోర్టులో విజయం విజయం సాధించాయి. మాల్యా ఆస్తులకు సంబంధించి యాజమాన్య వివరాలు అందించాలని బ్యాంకులు వేసిన అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది.

మాల్యా విలాస వస్తువులు.. కానీ నో డాక్యుమెంట్స్...
రెండు అత్యంత విలాసవంత విలాసవంతమైన పడవలు (సూపర్‌యాచ్), గేమ్ రిజర్వ్, వింటేజ్ కార్లు, విలువైన పెయింటింగ్స్, ఎల్టన్ జాన్‌కు చెందిన పియానో, వెల్లడించని అత్యంత విలువ కలిగిన మరెన్నో ఆస్తులు... విజయ్ మాల్యాకు ఉన్నాయి. ఐతే ఇవి మాల్యాకు చెందినవని ధృవీకరించేందుకు బ్యాంకుల కన్సార్టియం వద్ద లేదు. ఇప్పుడు అళా ధృవీకరణ పత్రాలు పొందే హక్కును ఈ కన్సార్టియంకు లభించింది.

కోర్టులకు సంతృప్తికర తీర్పు
మాల్యా ఆస్తులకు సంబంధించిన వాస్తవ యాజమాన్య హక్కులు, ఇంకా ఇతర డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం యూకే హైకోర్టులోని కమర్షియల్ కోర్టు డివిజన్‌ను అభ్యర్థించగా, సోమవారం బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కమర్షియల్ కోర్టు విభాగ న్యాయమూర్తి జస్టిస్ రాబిన్ నాల్స్ ఈ మేరకు తీర్పు చెప్పారు.

న్యాయమూర్తి ఏమన్నారంటే...
బ్యాంకుల వాదన సంతృప్తికరంగా ఉందని, ఈ వాదనను తేలిగ్గా తీసుకోలేమని, ఆయా ధ్రువీకరణ పత్రాలు లేకపోతే ఆస్తులు ఎవరివి అని తేల్చే అవకాశం వారికి ఉండదని, ఆస్తులు ఎవరివో తేలితేనే వాటిని జప్తు చేసే అవకాశముంటుందని న్యాయమూర్తి తెలిపారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులు తెలిస్తేనే వాటిని ఫ్రీజ్ చేయవచ్చున్నారు. ఓ సందర్భంలో న్యాయమూర్తి... భారతీయ కోర్టులకు, తమకు (బ్రిటన్ కోర్టులకు) పూర్తి విషయాలు చెప్పలేదన్నారు.

VMDS ఎవరిదో తేలాలి..
SBI నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం తమకు రావాల్సిన 1.45 బిలియన్ పౌండ్ల కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులను ఫ్రీజ్ చేసే ప్రక్రియలో ఉన్నాయి. సోమవారం విచారణలో భాగంగా VMDS ట్రస్ట్ వాస్తవ యాజమాన్యానికి సంబంధించిన కీలకమైన డాక్యుమెంటేషన్‌ను బహిర్గతం చేయాలని కూడా కోరారు, దీనికి మాల్యా తండ్రి విఠల్ మాల్యా (VM) పేరు పెట్టారు. అయితే, ఇందులో తనకు ఎలాంటి ప్రయోజనకారి కాదని మాల్యా చెబుతున్నారు. వివాదాస్పద ఆస్తులు ట్రస్ట్ ఆధీనంలో ఉన్నాయని చెప్పారు. ఈ కారణంతో VMDS యాజమాన్య పత్రాలు కావాలని కోరారు.

ఆల్ రోడ్స్ లీడ్ టు VMDS
VMDS ట్రస్ట్ పేరు మీద ఎక్కువ ఆస్తులు ఉన్నందున దీనిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారని తెలుసుకునే పనిలో భారతీయ బ్యాంకులు ఉన్నాయి. ఏ ఆస్తి గురించి తెలుసుకోవాలనుకున్నా VMDS వైపు వెళ్తున్నాయనే అర్థం వచ్చేలా.. ఆల్ రోడ్స్ లీడ్ టు VMDS అని బ్యాంకుల కన్సార్టియం తరఫున వాదనలు వినిపించే లాయర్ అన్నారు. అందుకే VMDS దీనిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో తెలిస్తే మాల్యాకు చెందిన మరిన్ని ఆస్తులు బయటపడతాయని చెబుతున్నారు. తాను సృష్టించిన ఆస్తుల ప్రపంచం నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో మాల్యా దూరం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications