రూ.18,000 కోట్ల జీఎస్టీ బకాయిలు, ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన బ్యాంకులు

జీఎస్టీ బకాయిల విషయం లో సుమారు 12 బ్యాంకులు భారత ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఉండటం గమనార్హం. బ్యాంకులు అందించే రాకరాక సర్వీసులపై జీఎస్టీ ని ఎగవేస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇది ఏకంగా రూ 18,000 కోట్ల మేరకు ఉందని అభిప్రాయపడింది. చట్టానికి కొత్త భాష్యం చెబుతూ బ్యాంకులు పన్ను ఎగవేస్తున్నాయని భావిస్తోంది. ఈ మేరకు వివిధ బ్యాంకులకు నోటీసులు కూడా జారీ చేసింది.

ఏడాది అయినా కూడా బ్యాంకులు నోటీసులకు స్పందించక పొగా అనేక రకాల ఫోరంలను ఆశ్రయించాయి. చివరకు అవి ఢిల్లీ హై కోర్ట్ మెట్లు ఎక్కాయని ది టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక ఒక కథనం లో వెల్లడించింది. ఇది బ్యాంకింగ్ రంగానికి సంభందించిన అంశం కాబట్టి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దీనిని టేకప్ చేసినట్లు సమాచారం. 2018 ఏప్రిల్ లోనే ప్రభుత్వం ఈ బ్యాంకులకు నోటీసులు జరీ చేసినట్లు పత్రిక పేర్కొంది.

వార్షిక ఫీజులు, లాకర్ చార్జీలు...

వార్షిక ఫీజులు, లాకర్ చార్జీలు...

వినియోగదారులకు అందించే వివిధ రకాల సేవలకు బ్యాంకులు ప్రత్యేక రుసుములు వసూలు చేస్తాయి. అందులో వార్షిక ఫీజులతో పాటు, లాకర్ చార్జీ ఇతరత్రా సర్వ్ ఫీజులు ఉంటాయి. కానీ... బ్యాంకులు ఈ మధ్య డిపాజిట్ స్కీం లతో కలిపి ఈ సేవలను అందిస్తుండటమే అసలు సమస్యగా మారింది. ఉదాహరణకు, బ్యాంకు ఒక ఏడాదికి లఖేరిపై రూ 2,000 అద్దె వసూలు చేస్తే... ప్రభుత్వానికి రూ 360 జీఎస్టీ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ బ్యాంకులు ... రూ 50,000 డిపాజిట్ చేసిన వారికీ ఈ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తుండటం తో ప్రభుత్వం ఆ మేరకు పన్ను ఆదాయాన్ని కోల్పోతోంది. ఇలా లెక్కించిన మొత్తమే రూ 18,000 కోల్టుగా లెక్క తేలటం విశేషం.

HDFC బ్యాంకు టాప్...

HDFC బ్యాంకు టాప్...

ప్రభుత్వం ఆరోపిస్తున్న విధంగా చూస్తే ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు HDFC ఇందులో ముందు వరుసలో ఉంది. ఈ బ్యాంకు సుమారు రూ 6,200 కోట్ల మేరకు పన్ను బకాయి పడిందని ప్రభుత్వం క్లెయిమ్ చేస్తోంది. తర్వాతి స్థానంలో మరో దిగ్గజ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ నిలుస్తోంది. దీని బకాయిల మొత్తం రూ 3,500 కోట్లుగా తేలింది. మరో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐన ఆక్సిస్ బ్యాంకు రూ 3,300 కోట్లు బకాయి పడింది. కోటక్ బ్యాంకు రూ 1,000 కోట్లా మేరకు పన్ను చెల్లించాల్సి ఉంది. యెస్ బ్యాంకు రూ 260 కోట్ల పన్ను చెల్లింసల్సి ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రూ 970 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ 900 కోట్లు, బ్యాంకు అఫ్ బరోడా రూ 260 కోట్లు , కార్పొరేషన్ బ్యాంకు రూ 3 కోట్లు పన్ను బకాయి పడినట్లు ది టైమ్స్ అఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. అలాగే విదేశి బాకులు ఐన సిటీ బ్యాంకు రూ 650 కోట్లు, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు రూ 350 కోట్లు, HSBC రూ 130 కోట్లు, డాయిష్ బ్యాంకు రూ 35 కోట్లు జీఎస్టీ బకాయి పడినట్లు పత్రిక తన కథనం లో పేర్కొంది.

సామాన్య కథలకు వర్తించదు...

సామాన్య కథలకు వర్తించదు...

అయితే బ్యాంకులు ఇలాంటి ప్రత్యేకమైన సేవలను జాన్ ధన్ కథలు, సామాన్య సేవింగ్స్ కథలకు అందిచవని సమాచారం. ప్రత్యేకమైన సేవలు కేవల ప్రీమియం, ఎలైట్ కస్టమర్ల మాత్రమేనని ... అక్కడే బ్యాంకులు కొత్త కొత్త పద్ధతులను అమలు చేస్తున్నాయని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. అసెట్ మేనేజ్ మెంట్ సేవల్లోనూ ఇలాంటి వైవిధ్యమైన సేవలు అందుబాటులో ఉన్నాయని ... వాటిని గుర్తించిన ప్రభుత్వం బ్యాంకులను దారికి తెచ్చే యోచనలో భంగంగానే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిరర్ధక ఆస్తులు పెరిగి పోయి కుయ్యో మొర్రో అంటున్న బ్యాంకులు నిజంగానే రూ 18,000 కోట్ల పన్ను కట్టాల్సి వస్తే వాటి పరిస్థితి అచ్చం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లే అవుతుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+