న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యోనో యాప్ సోమవారం (జూలై 22) డౌన్ అయింది. యోనో యాప్‌కు లాగిన్ అవలేకపోతున్నామని పలువురు కస్టమర్లు ఫిర్యాదు చేసారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లోను ఈ అంశంపై స్పందించారు. ఎస్బీఐ డిజిటల్ సేవా వేదిక యోనోకు (You Only Need One-YONO) ఆండ్రాయిడ్, ఐవోఎస్ పవర్డ్ మొబైల్ ఫోన్స్ ద్వారా యాక్సెస్ కావొచ్చు. అయితే ఈ రోజు యోనో యాప్‌తో పాటు నెట్ బ్యాంకింగ్ పోర్టల్ కూడా డౌన్ అయిందని కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. అయితే సాయంత్రానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లుగా కనిపించింది.

యోనో యాప్
యోనో యాప్‌తో పాటు ఎస్బీఐ పోర్టల్ పైన పెద్ద ఎత్తున ట్విట్టర్‌లో ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం ఉదయం నుంచి ఈ సేవలు డౌన్ అయ్యాయని ట్విట్టర్‌లో పేర్కొంటున్నారు. ఈ బ్లాకవుట్ పైన ఎస్బీఐ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. అయితే యోనో యాప్ ఆ తర్వాత సాయంత్రం మాత్రం ఓపెన్ అయింది. కొన్నిసార్లు చాలా స్లోగా ఓపెన్ అయింది.

సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ
డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న సమయంలో వినియోగదారులు ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సేవలు నిలిచిపోవడం వారికి ఇబ్బందికరంగా మారింది. ఖాతాదారులంతా ఫిర్యాదుల కొరకు సోషల్ మీడియాను ఆశ్రయించడంతో ఎస్బీఐ ట్విట్టర్ ఖాతా ఫిర్యాదులతో నిండిపోయింది.

వెల్లువెత్తిన ఫిర్యాదులు
ఎస్పీఐ నెట్ వర్క్ అంతా డౌన్ అయిందని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో యాప్‌కు యాక్సెస్ కాలేకపోతున్నామని శుభమ్ జాదవ్ అనే కస్టమర్ ఫిర్యాదు చేశారు. సాధారణంగా సోమవారం రోజు ఎస్బీఐ నెట్ వర్క్ డౌన్ అవుతుందని, ఇలా ఎందుకు జరుగుతోందని, మేం ఎక్కువగా నెట్ బ్యాంకింగ్ పైన ఆధారపడుతున్నామని, ఎస్బీఐ యోనో అలాగే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ వర్క్ కావడం లేదని రితిక్ సురానా అనే మరో నెటిజన్ ఫిర్యాదు చేశారు. ఇలా పలువురు ఫిర్యాదులు చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications