టాప్ 3లో ఆంధ్రప్రదేశ్, ఆ తేదీలోగా వివరాలు అందించిన రైతులకే పీఎం-కిసాన్

న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తోంది. మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల అకౌంట్లలో వేస్తారు. ఇప్పటికే తొలి విడతగా రూ.2వేలు రైతుల అకౌంట్లలో జమ అయింది. దేశవ్యాప్తంగా 14 కోట్లమంది రైతులు ఉన్నారు. పీఎం-కిసాన్ యోజన పథకం వారికి ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఇటీవల బడ్జెట్‌లో ఈ స్కీంకు మరిన్ని బడ్జెట్ ప్రకటిస్తారని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో నిధుల కొరత కారణమని భావించారు. కానీ ప్రభుత్వం కేటాయించిన రూ.75,000 కోట్లలో కొంత మొత్తం ప్రభుత్వానికి ఆదా కావడం గమనార్హం.

నాలుగు నెల్లలో రూ11,500 కోట్లు ఆదా

నాలుగు నెల్లలో రూ11,500 కోట్లు ఆదా

సమాచారం మేరకు, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వరుసగా కేవలం 11 శాతం, 9 శాతం మాత్రమే రైతుల డేటాను అప్ లోడ్ చేశారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ స్కీంలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ - జూలై 2019 నాలుగు నెలలకు గాను దాదాపు 8 కోట్ల మంది రైతులకు ఈ ప్రయోజనం చేకురుతుంది. దీంతో రూ.5.8 కోట్ల అర్హత గల రైతులకు చేకూరలేదు. మొత్తంగా ప్రభుత్వానికి ఈ నాలుగు నెలల్లో రూ.11,500 కోట్లు ఆదా అయింది.

రూ.15వేల కోట్ల మేర ఆదా

రూ.15వేల కోట్ల మేర ఆదా

అయితే గడిచిన కొద్ది ఈ స్కీం ప్రయోజనాలు వేగవంతమవుతుంటాయని (జూలై 31 నాటికి), అయినప్పటికీ ప్రభుత్వానికి రూ.15,000 కోట్ల మేర ఆదా కావొచ్చునని భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు చేరకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులైన జాబితాకు సంబంధించిన డేటా పూర్తిగా పెట్టకపోతే ఈ మొత్తం ఆదా అవుతుందని భావిస్తున్నారు.

ఆలస్యం అయ్యాక ఇచ్చేది లేదు...

ఆలస్యం అయ్యాక ఇచ్చేది లేదు...

జూలై 31వ తేదీ లోపు డేటా క్లియర్ చేసిన రైతులకు ఏప్రిల్ - జూలై పీరియడ్‌కు సంబంధించి రూ.2,000 జమ చేస్తామని ఆయా రాష్ట్రాలకు ముందే స్పష్టం చేశామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జూలై 31వ తేదీ తర్వాత తయారైన డేటాకు ఆగస్ట్ - నవంబర్ పీరియడ్‌కు మాత్రమే జమ చేస్తామని చెప్పామని తెలిపింది. అంతకుముందు పీరియడ్ అమౌంట్ ఇవ్వబోమని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు 7.4 కోట్ల మంది రైతుల డేటాను ఇచ్చాయి. ఇందులో రూ.5.5 వ్యాలిడేట్ అయ్యాయి మిగతావి వివిధ స్టేజీల్లో ఉన్నాయని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది.

డేటా పూర్తిగా ఇవ్వని రాష్ట్రాలు...

డేటా పూర్తిగా ఇవ్వని రాష్ట్రాలు...

బీహార్‌లో 1.64 కోట్ల మంది రైతులు ఉండగా, కేవలం 18 లక్షల డేటా వ్యాలిడేట్ అయింది. మధ్యప్రదేశ్‌లో 1.45 కోట్ల మంది రైతులు ఉండగా, 13 లక్షలు, మహారాష్ట్రలో 1.44 కోట్ల మంది రైతులు ఉండగా, 23 శాతం డేటా మాత్రమే అప్ లోడ్ అయింది. పీఎం - కిసాన్ స్కీం కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి డేటాను అందించలేదు. యూపీలో 2.33 కోట్లమంది రైతులు ఉండగా, దాదాపు సగం జాబితా అందించింది. గుజరాత్‌లో 53.4 శాతం (60 శాతం) డేటా ఇచ్చింది. కేంద్రం ధృవీకరించిన జాబితా కంటే పంజాబ్ ఎక్కువ డేటా ఇవ్వడం గమనార్హం.

రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్

రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్

ఇరవై రోజుల క్రితం సమర్పించిన డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. జూన్ 25వ తేదీ నాటికి చూస్తే యూపీలో రెండు ఇన్‌స్టాల్‌మెంట్ల 1.20 కోట్లమందికి పీఎం కిసాన్ బీమా అమౌంట్ జమ అయింది. 34.92 లక్షల లబ్ధిదారులతో ఏపీ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర (31.75 లక్షలు), గుజరాత్ (29.80 లక్షలు), రాజస్థాన్ (28.26 లక్షలు) ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+