ఆ ఇన్సురెన్స్ పాలసీతో జాగ్రత్త, అది ఎందుకూ ఉపయోగపడదు!!
చెన్నై: మీకు వాహనం ఉందా? మోటార్ ఇన్సురెన్స్ పాలసీ చేయిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నకిలీ మోటార్ ఇన్సురెన్స్ పాలసీలతో కొంతమంది మోసగిస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఫేక్ మోటార్ పాలసీలు రెండేళ్లలోనే రెండింతల కంటే ఎక్కువగా పెరిగాయి. అంతకుముందు 498 కేసులు ఉండగా, ఇప్పుడు 1,192 కేసులు నమోదయ్యాయి.

ఫేక్ ఇన్సురెన్స్ పాలసీ
గత రెండేళ్లలో రూ.53 కోట్ల విలువ కలిగిన ఫేక్ ఇన్సురెన్స్ పాలసీలు విక్రయించారు 2016-17లో ఫేక్ పాలసీల విక్రయాలు 498గా ఉన్నాయి. 2017-18లో ఇవి 823గా ఉండగా, 2018-19 నాటికి ఇవి 1,192కు పెరిగాయి. ట్రక్, టూ వీలర్ వాహనదారులు ఎక్కువగా ఫేక్ పాలసీలను కొనుగోలు చేశారు. రెన్యూవల్ పాలసీల రూపంలో డూప్లికేట్ పాలసీలను విక్రయించారు. ఒరిజినల్ మోటార్ ఇన్సురెన్స్ పాలసీ, డూప్లికేట్ వెహికిల్ ఇన్సురెన్స్ పాలసీని సులభంగా గుర్తించలేం.

సగం ధరకే ఫేక్ ఇన్సురెన్స్ పాలసీ
అసలు మోటార్ ఇన్సురెన్స్ పాలసీ ధర రూ.10,000 వరకు ఉంటుంది. అదే సమయంలో ఫేక్ పాలసీ ధర రూ.5,000 నుంచి రూ.6,000 దాకా ఉంటుంది. ఫేక్ పాలసీలతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాలసీల వల్ల వారు కేవలం పోలీసులు అడిగినప్పుడు చూపించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఇన్సురెన్స్ క్లెయిమ్ చేసే సమయంలో ఏమాత్రం ఉపయోగపడవు. అయినప్పటికీ చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారని బజాజ్ అలయన్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ లాస్ మైగ్రేషన్ టీమ్ హెడ్ సంజీవ్ ద్వివేది అన్నారు. ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్సురెన్స్ పాలసీ పైన బార్ కోడ్, క్యూఆర్ కోడ్ వంటివి ఉంటాయి వీటిని స్కాన్ చేసి పాలసీ వివరాలు సరిచూసుకోవచ్చు. 3డీ హోలోగ్రామ్ స్టిక్కర్లు కూడా వస్తున్నాయి.

మిస్‌లీడ్ చేస్తున్నారు
2018లో తాము 93 ఫేక్ మోటార్ ఇన్సురెన్స్ పాలసీ కేసులు పెట్టామని, ఇందులో ఎక్కువగా యూపీలోని ఫిరోజ్‌పూర్, కేరళలోని తిరువనంతపురం, మహారాష్ట్రలోని అక్లుజ్లో విక్రయించారని ద్వివేది తెలిపారు. ఎక్కువ ఫేక్ పాలసీలు సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ కోసం చేయిస్తున్నారని తెలిపారు. ఇన్సురెన్స్ సెక్టార్‌లో ఫేక్ పాలసీలు ఇదే మొదటిసారి కాదని, ఫేక్ పాలసీ ఏజెంట్స్ తమ బ్రాండ్ నేమ్స్ ఉపయోగించుకొని వాహనదారులను మిస్‌లీడ్ చేస్తున్నారని, వాటిని తక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఐసీఐసీఐ లాంబార్డ్ సంజయ్ దత్తా అన్నారు.


Click it and Unblock the Notifications